సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన గాలోడు మూవీ థియేటర్స్ లో మాస్ మూవీ గా దుమ్ము లేపింది. గాలోడు సినిమాకి క్రిటిక్స్ చెత్త రివ్యూస్ ఇచ్చినా సుడిగాలి సుధీర్ కోసం మాస్ ఆడియన్స్ క్యూ కట్టడంతో ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. సినిమాని హిట్ చేసారు. గాలోడు రివ్యూస్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదన్నట్టుగా సుధీర్ హవా కొనసాగించాడు. ఇక గాలోడు కోసం వెయిటింగ్ అంటే గాలోడు ఓటిటి రిలీజ్ కోసం మాత్రం కాదు, సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా రిలీజ్ అయ్యింది, సుధీర్ ఫ్రీ అయ్యాడు.
జబర్దస్త్ లోకి సుడిగాలిగా సుధీర్ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడో అంటూ ఆయన అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. గాలోడు ప్రమోషన్స్ లో జబర్దస్త్ కి మళ్ళీ వెళ్తాను, ఇప్పటికే నేను జబర్దస్త్ వదిలి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యాయి, త్వరలోనే రీ ఎంట్రీ అంటూ మాట్లాడిన సుధీర్ ఎప్పుడెప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై కనిపిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి సుధీర్ జబర్దస్త్ కి రాక ఇంకా ఖాయమవ్వలేదా.. లేదంటే ఇంకేమన్నా అనేది అభిమానులకి అర్ధం కావడం లేదు.
ఇక సుధీర్ గాలోడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి త్వరలోనే ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతుంది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ గాలోడుకి డిజిటల్ హక్కులకు భారీగానే చెల్లించినట్టుగా తెలుస్తుంది.