గతంలో సినిమా కి హిట్ టాక్ పడితే రెండుమూడు వారాలు థియేటర్స్ లో ప్రేక్షకుల కళకళలు, కిలకిలలు కనిపించేవి, వినిపించేవి. ఓటిటీల ప్రాధాన్యత పెరిగాక అది రెండు వారాలకు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మధ్యన ప్రేక్షకుడు మరీ తెలివిగా ఆలోచించేస్తున్నాడు. సినిమా సూపర్ హిట్ అయిన మూడు రోజుల వరకే ఆ సినిమా థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. సోమవారం స్టార్ట్ అయ్యింది అంటే ప్రేక్షకుడు థియేటర్ మొహమే చూడడం లేదు. ఎంత హిట్ సినిమా అయినా ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు.
సక్సెస్ అయిన సినిమాకి మూడునాళ్ళ ముచ్చటే అనిపిస్తుంది. ఏదో నిర్మాతలు సూపర్ హిట్ సినిమాకి ఎనిమిదివారాలు, పోయిన సినిమాకి నాలుగు వారాల రూల్ పెట్టారు. ఎవ్వరూ దాన్ని పాటించడం లేదు, సో ప్రేక్షకుడు కూడా థియేటర్స్ కే వెళ్ళాలి, సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ ని పక్కన బెట్టి ఓటిటిలో వస్తుంది కదా అనే ధీమాతో ఉంటున్నారు. ఈ శని, ఆదివారాల్లో సినిమా చూసేసేవారు ఉంటారు. సోమవారం అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. పర్టిక్యులర్ గా సినిమా చూడాలనే సీన్ లేదు.
ఇక వచ్చే శుక్రవారం మరో కొత్త సినిమా.. అది హిట్టా.. ఫట్టా అనేది సాయంత్రానికి డిసైడ్ అవుతుంది.. అలా ఆ వీకెండ్ ఫినిష్.. ఇలా ఉన్నారు ప్రేక్షకులు. ఇక హిట్ అయిన సినిమాలైనా కేవలం మూడురోజుల ముచ్చటే.. ఆదివారం అయిపోతే సర్దేసుకోవడమే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.