సమంత మెయిన్ లీడ్ లో హీరోయిన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన యశోద నవంబర్ 11 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టింది. సమంత మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ.. యశోద ప్రమోషన్స్ కి రాలేకపోయినా ఆడియన్స్ మాత్రం యశోదని ఆదరించారు. దానితో సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాదాపు 30 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఓటిటి విడుదల పై ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆశక్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓటిటిలో రిలీజ్ అవుతుందా అని చాలా వెయిట్ చేస్తున్నారు.
అయితే యశోద మూవీలో కీలకమైన EVA ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో హాస్పిటల్ ని చూపించడంతో ఆ హాస్పిటల్ వారు అభ్యంతరాలు లేపడంతో.. నిర్మాతలు కాంప్రమైజ్ అయ్యి ఆ వివాదాన్ని పరిష్కరించారు. దానితో యశోద మూవీకి ఉన్న అడ్డంకులు తీరిపోయాయి. ఫైనల్ గా యశోద ఓటిటి లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 9 న అమెజాన్ ప్రైమ్ లో యశోద విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.