బ్లాక్ బస్టర్ చంద్రముఖికి సీక్వెల్ గా దర్శకుడు పి వాసు రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 ని ఈ మధ్యనే అఫీషియల్ గా మొదలు పెట్టారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న రాఘవ లారెన్స్.. చంద్రముఖిలో రజిని కేరెక్టర్ ప్లే చేస్తున్నాడు. అప్పట్లో జ్యోతిక చంద్రముఖిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించగా.. చంద్రముఖి 2 లో చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తుంది. ఈ మధ్యనే కంగనా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
తాజాగా చంద్రముఖి 2 సెట్స్ లో కంగనా అడుగుపెట్టినట్లుగా సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చింది. చంద్రముఖి 2 మొదలైంది అంటూ పోస్ట్ చేసింది. కంగనా చంద్రముఖి 2 లో చంద్రముఖిగా నెగెటివ్ షేడ్స్ అలాగే అమాయకంగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. చెన్నై లో ఓ స్టూడియో లో వేసిన భారీ సెట్ లో రాఘవ లారెన్స్-కంగనా కాంబో సీన్స్ ని పి వాసు తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. చంద్రముఖి 2 తో పాటుగా కంగనా ఇందిరాగాంధీ పాత్రలో ఎమెర్జెన్సీ సినిమాలో నటిస్తుంది.