చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ పై గొంతెత్తినా దానికి సంబందించిన చర్యలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. స్టార్ హీరోయిన్స్ సైతం క్యాస్టింగ్ కౌచ్ పై సెన్సేషనల్ గా మాట్లాడినవారు ఉన్నారు. కాకపోతే ధైర్యంగా పేర్లు బయటపెట్టే హీరోయిన్స్ చాలా అరుదుగా ఉండేవారు. తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్ పై కీర్తి సురేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనకి చాలామంది హీరోయిన్స్ సినిమా పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ విషయం, తమకి ఎదురైన అనుభవాలను చెప్పారని, కానీ తన వరకు ఏ క్యాస్టింగ్ కౌచ్ రాలేదని అంటుంది.
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్కోసారి మన ప్రవర్తనని బట్టి ఉంటుందేమో నాకు తెలియదు, నాకు ఇలాంటి సిట్యువేషన్ ఇప్పటివరకు ఎదురు కాలేదు. ఒకవేళ నాకు అవకాశం ఇచ్చేవారు కమిట్మెంట్ అడిగితే నేను అస్సలు ఒప్పుకోను, ఒకవేళ సినిమాలు లేకపోతే ఉద్యోగం అయినా చేసుకుంటాను కానీ అవకాశాల కోసం కమిట్మెంట్ ఇచ్చేంత దిగజారిపోను అంటూ కీర్తి సురేష్ క్యాస్టింగ్ కౌచ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ఇక కెరీర్ పరంగా కీర్తి సురేష్ చేతిలో నాని దసరా, చిరు భోళా శంకర్ సినిమాలు ఉన్నాయి. అలాగే తమిళ, మలయాళ ఫిలిమ్స్ లో నటిస్తూ కీర్తి సురేష్ బిజీగా వుంది.