జబర్దస్త్ లో అనసూయ ప్లేస్ ని రీప్లేస్ చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. అంతలా అనసూయ జబర్దస్త్ స్టేజ్ పై ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. జబర్దస్త్ స్టేజ్ పైన ఆమె డాన్స్, ఆమె గ్లామర్ షో ని
కామెడీ ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. అనసూయ జబర్దస్త్ ని వదిలేసినప్పుడు కామెడీ హృదయాలు ముక్కలయ్యాయి. ఏడెనిమిదేళ్లు జబర్దస్త్ లో తన హావా కొనసాగించిన అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోవడం ఆఖరికి కమెడియన్స్ కి, మల్లెమాల కి కూడా ఇష్టం లేదు. కానీ అనసూయ నాకు బ్రేక్ కావాలంటూ ఏకంగా రెండుళ్లు విరామం ప్రకటించింది.
జబర్దస్త్ లో బాడీ షేమింగ్ నచ్చలేదు, తనకి కొద్ది రోజులు బయటికి రావాలి అనిపించింది, సో వచ్చేసాను అంటూ అనసూయ అప్పట్లో జబర్దస్త్ ఎందుకు మానేసిందో చెప్పింది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన అనసూయని జబర్దస్త్ మిస్ అవుతున్నారా అని అడిగితే అవును చాలా మిస్ అవుతున్నా అని చెప్పింది. నా హృదయంలో జబర్దస్త్ కి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కొన్నిసార్లు జీవితంలో క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్పదు. కొద్దిరోజులు టీవీ షోస్ కి బ్రేక్ ఇచ్చాను. ఏదైనా మనసుకి నచ్చిన షో వస్తే తప్పకుండా చేస్తాను.
కాకపోతే కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలతో కొంతమందిని బాధపెట్టినా.. వారు అర్ధం చేసుకుంటారని భావిస్తాను అంటూ అనసూయ చిట్ చాట్ లో చెప్పుకొచ్చింది. అనసూయ జబర్దస్త్ మిస్ అవుతున్నా అని చెప్పడం చూసిన వారు అనసూయ త్వరలోనే మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ పైకి వచ్చేస్తుంది. అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.