గత కొద్దివారాలుగా బిగ్ బాస్ హౌస్ లో ఇనాయ హవా బాగా కనబడింది. ఆడపులి, లేడీ కింగ్ అంటూ ఆమె ఫాన్స్ కూడా బయట రచ్చ చేస్తున్నారు. సూర్య హౌస్ లో ఉన్నప్పుడు అతనితో రాసుకుని పూసుకుని తిరిగిన ఇనాయ అతను వెళ్ళగానే ఆటలోకి వెళ్ళిపోయి రేవంత్ కే చుక్కలు చూపించింది. అంటే రేవంత్ కి పోటీగా బయట ఆడియన్స్ నుండి ఓట్స్ తెచ్చుకుంది. రేవంత్ తో ప్రతి వారము నామినేషన్స్ లో ఉన్నప్పుడు పోటీ పడింది. అంతలా ఇనాయ గ్రాఫ్ పెరిగిపోయింది. మధ్యలో శ్రీహన్ తో గొడవతోనే ఆమె బాగా హైలెట్ అయ్యింది. అసలు ముందు రెండు వారాల్లోనే మూటా ముల్లే సర్దుకోవాల్సిన ఇనాయని ఆమె గేమ్ ఆమెని కాపాడింది.
అంతలా ఓటింగ్స్ లో క్రేజ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది, రేవంత్ కి గట్టిపోటి ఇస్తున్న ఇనాయకి ఇప్పుడు రోహిత్ షాకిస్తున్నాడు. రోహిత్ మంచితనం, అతని పెరఫార్మెన్స్ అన్ని అతనికి క్రేజ్ ని తెచ్చిపెడుతున్నాయి. గత రెండు వారాలుగా రోహిత్ రేవంత్ తర్వాత ప్లేస్ లోకి వచ్చేసాడు. ఈ వారం ఓటింగ్ లో ఇనాయ నాలుగో స్థానంలో ఉంటే.. రేవంత్ మొదటి స్థానంలో, రోహిత్ రెండో స్థానంలో ఉన్నారు. గత వారం గేమ్ లో ఇనాయ-రోహిత్ గొడవలో నాగ్ రోహిత్ నే సపోర్ట్ చేసారు. అక్కడ రోహిత్ కి ప్లస్ అయ్యింది. రోహిత్ ని గత రాత్రి ఎపిసోడ్ లో శ్రీహన్ ని బిగ్ బాస్ ఇమ్మిడియట్ గా హౌస్ నుండి బయటికి పంపే కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే దానికి రోహిత్ పేరు చెప్పాడు. మరీనా వెళ్లాకే నీ గేమ్ బావుంది. నువ్వు బాగా ఎక్స్పోజ్ అవుతున్నావ్ కానీ అంతకుముందు నువ్వు నీ అట కనబడలేదు అన్నాడు. దానికి రోహిత్ ఫీలయ్యాడు. అతన్ని నామినేట్ చేసినందుకు శ్రీహన్ కూడా ఫీలయ్యాడు.
అంతలా హౌస్ లోనే కాదు, బయట కూడా రోహిత్ హవా గట్టిగానే మొదలయ్యింది. టాప్ 2 లో ఉండాల్సిన ఇనాయని పక్కనపడేసి మరీ రోహిత్ కి ఓట్స్ గుద్దుతున్నారు ఆడియన్స్.