మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాన్స్ ని తెగ వెయిట్ చేయిస్తున్నారు. మరోపక్క నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. వారు చేసుకునే పండగ చూసిన మెగా ఫాన్స్ కుళ్ళుకుంటున్నారు. మెగాస్టార్ మొద్దు నిద్రలో ఉన్నారేమో అంటూ మెగా ఫాన్స్ నిరీక్షిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య డేట్ ని ప్రకటిస్తారని మెగా ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి జనవరి 12 న వస్తున్నా అంటూ గర్జించారు. అలాగే జనవరి 11 న యూఎస్ ప్రీమియర్స్ అంటూ హంగామా మొదలు పెట్టేసారు.
కానీ మెగాస్టార్ గాఢ నిద్రలో ఉన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. కొత్త సినిమా డేట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారో.. లేదో.. అనే అనుమానంలో ఫాన్స్ ఉన్నారు. అయితే వాల్తేర్ వీరయ్య జనవరి 13 న వస్తున్నారనే టాక్ ఉన్నప్పటికీ.. మేకర్స్ ఇంకా ఈ విషయంలో నాన్చుతూనే ఉన్నారు. మెగా ఫాన్స్ మాత్రం ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. వీర సింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య రెండు సినిమాలు ఒకే బ్యానర్ లో తెరకెక్కడంతో ఒక సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మరో సినిమాకి తక్కువ ప్రయారిటీ ఇస్తారా అంటూ మైత్రి బ్యానర్ పై కూడా మెగా ఫాన్స్ చిందులు తొక్కుతున్నారు.
ఆ డేట్ ఏదో ఎనౌన్స్ చేస్తే మేము మా హడావిడి చేస్తాము, ముందు ఆ డేట్ ఇవ్వండి సామీ.. మెగాస్టార్ నిద్ర లెవ్వండి సామీ.. అంటూ మెగా ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మెగా ఫాన్స్ నిరీక్షణ తీరేది ఎప్పుడో చూడాలి.