దర్శకుడు బాలా అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి రీమేక్ విషయంలో కాంట్రవర్సీకి కారణమయ్యారు. ఇప్పుడు సూర్య తో చేస్తున్న సినిమా విషయంలో దర్శకుడు బాలా మరో వివాదానికి తెర లేపారు. బాలా-సూర్య మాములు కాంబో కాదు క్రేజీ కాంబో వీరిద్దరిది. నంద, శివ పుత్రుడు లాంటి హిట్ సినిమాలు చేసిన వీరిద్దరూ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మరొక మూవీ కోసం పని చేస్తున్నారు. సూర్య-బాలా ఈ కలయికలో మూవీ అనౌన్సమెంట్ వచ్చిన చానా ఏళ్ళకి సినిమా పట్టాలెక్కింది. సూర్య హీరోగా బాలా దర్శకత్వంలో భారీ అంచనాలు నడుమ కన్యాకుమారిలో షూటింగ్ కూడా మొదలైంది.
తొలి షెడ్యూల్ కన్యాకుమారిలో భారీ సెట్ వేసి షూట్ చేసారు. కానీ రెండో షెడ్యూల్ వచ్చేసరికి సూర్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. సూర్య హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నాడో ఆయన ఫాన్స్ కి అర్ధం కాకపోయినా.. సూర్య తప్పుకున్న విషయాన్ని బాలానే బయపటపెట్టడం విశేషం. ఈ ప్రాజెక్ట్ నుండి సూర్య తప్పుకున్నప్పటికీ.. మరొక హీరో ని తెచ్చి సినిమాని పూర్తి చేస్తామంటూ బాలా ప్రకటించారు.
మరి సూర్య-బాలాకి మధ్యలో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్లనే సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని కొందరు, వీరికి సెట్ లోనే గొడవైన కారణంగానే సూర్య వెళ్లిపోయాడని, మరోపక్క బడ్జెట్ లెక్కకి మించి పెట్టడం సూర్యకి నచ్ఛలేదని, అలాగే ప్రతిసారి షెడ్యూల్ వాయిదా పడడంతో విసుగెత్తిన సూర్య ఈప్రాజెక్టు నుండి తప్పుకున్నాడనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.