అమీర్ ఖాన్ లాల్ సింగ్ చెడ్ద దెబ్బకి సినిమాలకి బ్రేక్ ఇచ్చేసారు. ఓ ఏడాదిన్నరపాటు సినిమాలు చెయ్యకూడదని డిసైడ్ అయ్యారాయన. ప్రస్తుతం తన ఫ్యామిలీతో తన అమ్మతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్న అమీర్ ఖాన్.. తన పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకే ఒక్క సినిమా తన కుటుంబాన్ని పాతాళానికి తొక్కేసింది. ఆ సినిమా వలన ఆర్థికంగా మా కుటుంబం చితికిపోయింది, అప్పుల వాళ్ళ గొడవతో మేమెంతో బాధపడే వాళ్ళం అంటూ తన చిన్నప్పుడు తన తండ్రి తీసిన ఒక సినిమా వలన తాము ఎన్ని కష్టాలు అనుభవించామో అనేది అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఎమోషనల్ అయ్యారు.
అమీర్ ఖాన్ తండ్రి ఆయన తనకి పదేళ్ల వయసులో ఓ సినిమా తీసారట. తన తండ్రి నిర్మాతగా తాహిర్ హుస్సేన్ లాకెట్ అనే సినిమా చేసారట. ఈ సినిమా కోసం అప్పట్లో స్టార్ నటులని తీసుకున్నారట. అయితే అమీర్ ఖాన్ తండ్రి పెద్ద నిర్మాత కాకపోవడంతో.. ఆ నటులు సరిగ్గా డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో తాహిర్ హుస్సేన్ లాకెట్ ని దాదాపుగా ఎనిమిదేళ్ళకి పూర్తి చేశారట. ఈ సినిమా పూర్తయ్యేలోపులో ఆర్ధికంగా అమీర్ ఖాన్ ఫ్యామిలీ ఇబ్బంది పడడం కాదు, అప్పుల వాళ్ళ చేతిలో నానా మాటలు పడేవారట.
అమీర్ తండ్రి అప్పుల వాళ్లకి ఎంతగా నచ్చ జెప్పినా వారు వినకుండా రచ్చ చేసేవారట, నాన్న కష్టాలు చూసి ఏడ్చేవాడిని, అప్పటికి నా వయసు 10 ఏళ్ళు, ఏమి చెయ్యలేని పరిస్థితి. ఒకే ఒక్క సినిమా మమ్మల్ని పాతాళానికి తొక్కేసింది అంటూ అమీర్ చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.