విజయ్ దేవరకొండ అంటే క్రష్.. విజయ్ దేవరకొండ తో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను అంటూ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ తో హాగ్ చేసుకుని కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రీసెంట్ గా మిలి ప్రమోషన్స్ లోనూ జాన్వీ కపూర్ సౌత్ సినిమాల్లో నటించాలని ఉంది, ఆఫర్ వస్తే సౌత్ కి ఎంట్రీ ఇస్తాను అంటూ మాట్లాడం, ఇప్పుడు విజయ్ తల్లితో జాన్వీ కపూర్ కనిపించడం ఇవన్నీ ఇంట్రెస్టింగ్ కలిగించే అంశాలు.
బాలీవుడ్ హీరోయిన్స్ సారా అలీ ఖాన్, అలియా భట్ అలాగే జాన్వీ కపూర్ అందరూ విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని చెప్పినవారే. కానీ జాన్వీ కపూర్ లా విజయ్ పేరెంట్స్ ని అయితే కలవలేదు. అయితే జాన్వీ కపూర్ - విజయ్ తల్లి మాధవి ఎక్కడ కలిశారు అనేది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉన్నా.. వీరి కలయిక రౌడీ ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్ తో ఏమన్నా జోడి కడుతున్నాడేమో.. అందుకే జాన్వీ విజయ్ తల్లితో కలిసి ఉంది అంటూ ఊహించుకుంటున్నారు.
మరి జాన్వీ కపూర్ మాధవి దేవరకొండ ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు కలిసింది అంటూ ఇండస్ట్రీలోనూ చర్చలు మొదలైపోయాయి.