బిగ్ బాస్ సీజన్ 6 కి వచ్చిన పరమ చెత్త రేటింగ్స్ ఏ సీజన్ లోనూ రాలేదనే చెప్పాలి. బిగ్ బాస్ లో ఫన్ లేదు, ఓ ఎంటర్టైన్మెంట్ లేదు.. వీక్ డేస్ లో మాత్రమే కాదు.. నాగార్జున వచ్చే వీకెండ్స్ లోనూ బోర్ కొట్టేస్తుంది. నాగర్జున ఎపిసోడ్స్ లో ప్రేక్షకులని నవ్వించడానికి టాస్క్ ల కోసం నాగార్జున ఇంకా బిగ్ బాస్ యాజమాన్యం, నానా హైరానా పడుతున్నారు. గత కొన్ని వారాలుగా ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా కిక్ ఇవ్వడం ఎలేదు, ఎలిమినేట్ అయిన వారు బిగ్ బాస్ స్టేజ్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తారని చూస్తే.. మెల్లగా, చల్లగా బయటికి వెళ్లిపోతున్నారు కానీ.. ఎవ్వరూ ఓపెన్ అవ్వడం లేదు.
కేవలం రేవంత్ ఆట, శ్రీ సత్య అందాలు, ఇనాయ అరుపులు, శ్రీహన్ స్ట్రాటజీ, అది రెడ్డి రివ్యూస్, కీర్తి ఏడుపు ఇవే హౌస్ లో కనబడుతున్నాయి తప్ప బిగ్ బాస్ లో మరేమి ఇంట్రెస్టింగ్ ఎలిమిమెంట్స్ లేవు. బిగ్ బాస్ లో గీతూ రాయల్ ఉన్నప్పుడు ఆమె కాస్త ఫన్ చేసేది. కానీ ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ ఆమె కొంప ముంచింది. గీతూ ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ హౌస్ ఆ టైపు ఫన్ లేకుండా పోయింది. శ్రీహ-ఇనాయ మధ్యన గొడవ రసవత్తరంగా ఉండేది ఇప్పుడు అదీ లేదు.
సీజన్ 6 చూడాలంటే బోర్ కొట్టేస్తుంది అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అసలు బిగ్ బాస్ సీజన్ 6 చూసాక మరో సీజన్ ని ఆడియన్స్ అస్సలు ఆదరించరు. దీని కోసం పారితోషకాలు ఎక్కువ ఇచ్చి కంటెస్టెంట్స్ ని తీసుకురావడం కూడా దండగ అనే కామెంట్స్ పడుతున్నాయి. అసలు ఇది అంతా కేవలం లీకులు వలనే జరుగుతుంది. వారం వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనే విషయాన్ని యాజమాన్యం కావాలనే లీక్ చేస్తుంది. అదే ఆ బిగ్ బాస్ రేటింగ్ తగ్గడానికి కారణమయ్యింది.