Advertisementt

దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్న SSMB28 టీమ్

Mon 05th Dec 2022 02:21 PM
mahesh babu,trivikram,thaman,dubai  దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్న SSMB28 టీమ్
SSMB28 Music Sittings In Dubai దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్న SSMB28 టీమ్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు పూర్తిగా వర్క్ మూడ్ లోకి వచ్చేసారు. తండ్రి కృష్ణ మరణం తర్వాత మహేష్ బాబు ఆయనకి చెయ్యాల్సిన దశదిన కర్మలని పూర్తి చేసి వారం గ్యాప్ లోనే ఆయన పనిలో పడిపోయారు. రీసెంట్ గా ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న మహేష్ కొత్త లుక్ ఫాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసింది. ఇక ఆ యాడ్ షూట్ పూర్తి కాగానే మహేష్ బాబు SSMB28 సెట్స్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. అయితే తాజాగా త్రివిక్రమ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ ప్రయాణం పెట్టారు.

యాడ్ షూట్ తో రీఛార్జ్ అయిన మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, అలాగే నిర్మాత నాగ వంశి, దర్శకుడు త్రివిక్రమ్ లు మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లనున్నారు. త్వరలోనే దుబాయ్ ప్రయాణానికి ఏర్పాట్లు చేయనున్న SSMB28 టీమ్.. దానికన్నా ముందుగానే సెకండ్ షెడ్యూల్ డీటెయిల్స్ వెల్లడిస్తారట. SSMB28 లో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుండగా.. స్పెషల్ సాంగ్ కోసం రశ్మికని సంప్రదిస్తున్నారనే టాక్ నడుస్తుంది. 

దసరా కన్నా ముందే SSMB28 మొదటి షెడ్యూల్ పూర్తయినా రెండో షెడ్యూల్ మొదలు కావడానికి మూడు నెలల సమయం పట్టింది. మధ్యలో మహేష్ బాబు పర్సనల్ ప్రోబ్లెంస్ వలన షెడ్యూల్ లేట్ అవుతూ వచ్చింది.

SSMB28 Music Sittings In Dubai:

SSMB28 Leaving For Dubai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ