Advertisementt

రవితేజ ని ముంచేసిన మట్టి కుస్తీ

Mon 05th Dec 2022 10:31 AM
gatta kusthi movie,gatta kusthi box office collection  రవితేజ ని ముంచేసిన మట్టి కుస్తీ
Matti Kusthi poor collections రవితేజ ని ముంచేసిన మట్టి కుస్తీ
Advertisement
Ads by CJ

రవితేజ హీరోగా వరస సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్న హీరో. వరస షూటింగ్స్ తో క్షణం తీరిక లేని రవితేజ తమిళ హీరో విష్ణు విశాల్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా అప్పట్లో FIR సినిమాని తెలుగులో విడుదల చేసేందుకు సహాయం చేసాడు. తర్వాత విష్ణు విశాల్ తో కలిసి మట్టి కుస్తీ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాడు. రవితేజ కథ ఎంపిక లో ఉండే ఎక్స్ పీరియన్స్, అలాగే తెలుగు ప్రేక్షకులను ఎలాంటి కథలు ఇష్టపడతారో అనేది తెలుసున్న హీరో.

అందుకే రవితేజ-విష్ణు విశాల్ నిర్మించిన మట్టి కుస్తీ పై అంతో ఇంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఉంది. రవితేజ కూడా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అయితే విష్ణు విశాల్ హీరోగా వచ్చిన ఆ సినిమా మొదటి రోజే ప్రేక్షకులని నిరాశపరిచింది. అసలు ఫలితం తెలియకముందే ఆ సినిమాకి ఓపెనింగ్స్ పడలేదు. రవితేజ నిర్మాత అయినా ఆడియన్స్ ఆదరించలేదు. ఇక రిలీజ్ అయ్యాక ఆ సినిమాకొచ్చిన టాక్ ప్రేక్షకులని థియేటర్స్ కి కదలనివ్వలేదు. మొదటి రోజు కంటే రెండో రోజు దారుణంగా ఉన్న కలెక్షన్స్ మూడో రోజు మరింత దారుణంగా పడిపోయాయి. ఆ సినిమాతో రవితేజ ఎంత వాటా లాస్ అయ్యాడో తెలియదు కానీ.. అతని జేడ్మెంట్ ని ఆడియన్స్ మాత్రం ఘోరంగా తిరస్కరించారు. 

Matti Kusthi poor collections:

Gatta Kusthi Box Office Collection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ