రష్మిక మందన్న ఫైర్ మీదుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా వుంది. ప్రస్తుతం విజయ్ తో వారిసు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న రష్మిక పలు భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ ని పోస్ట్ చేసే రష్మిక ఈమధ్యన కాంట్రవర్సీలో ఇరుక్కుంది. మాతృ భాషలో తెరంగేట్రం సినిమాపై చేసిన కామెంట్స్ ఆమెకి తిప్పలు తెచ్చిపెట్టాయి. దానితో కన్నడ పరిశ్రమ ఆగ్రహానికి గురైంది రష్మిక. అంతేకాకుండా కన్నడ పరిశ్రమ రశ్మికని బాన్ చేసే యోచనలో ఉన్నట్లుగా కూడా వార్తలొచ్చాయి.
ఈ విషయమై ఎలాంటి కామెంట్ చెయ్యకుండా సైలెంట్ గా ఉన్న రష్మిక Elle Magazine మ్యాగజైన్ పై మెరిసింది. మ్యాగజైన్ ఫోటో షూట్ లో రష్మిక కాకపుట్టించేలాంటి ఫార్మల్ లుక్ లో అందాలు పరిచేసింది. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ షో అన్నట్టుగా ఉన్న రష్మిక ఎల్లో కలర్ ఫార్మల్ డ్రెస్ లో లూజ్ హెయిర్ తో సెగలు రేపింది. రష్మిక లోని కసి చూస్తుంటే ఫైర్ మీదున్న రష్మిక అనే కామెంట్ చెయ్యకుండా ఎవరూ వదలరు.
పుష్ప ద రైజ్ రష్యా లో రిలీజ్ చేస్తుండడంతో అక్కడ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ తో కలిసి రష్మిక మందన్న అదరగొట్టేసింది. త్వరలోనే పుష్ప పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంది.