ఇప్పుడు NTR30 ప్రీ ప్రొడక్షన్ లో కూల్ గా కొరటాల శివ తన పని తాను చేసుకుంటున్నా బయట మాత్రం కొరటాలపై నెగిటివిటి పోవడం లేదు. ఆచార్య డిసాస్టర్ ఎఫెక్ట్ ఎవరి మీద ఎంత ఉందో తెలియదు కానీ.. మొత్తంగా కొరటాల శివనే బ్లేమ్ చేసారు. ఇండైరెక్ట్ గా చిరు, రామ్ చరణ్ లు కొరటాల శివనే అన్నారు. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కొరటాల శివనే ఆచార్య డిసాస్టర్ విషయంలో బ్లేమ్ చేసారు. ఇలా ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా కొరటాల మాత్రం తిరిగి కౌంటర్ వెయ్యకుండా కామ్ గానే ఉంటున్నారు.
ఎవ్వరి కామెంట్స్ కి కొరటాల కౌంటర్ వేసి మాట్లాడేదేలే .. ఇకపై అన్ని చేతలే అంటున్నారట. NTR30 తో ఖచ్చితంగా ఈ కామెంట్స్ కి జవాబు చెప్పాలనే కసితో కొరటాల ఉన్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీ గా ఎన్టీఆర్ 30 ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి శెభాష్ అనిపించుకునేవరకు కొరటాల నిద్ర పోకుండా కష్టపడాలని డిసైడ్ అయ్యారట. అందుకే NTR30 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో క్షణం తీరిక లేకుండా కొరటాల బిజీగా ఉండి.. ఎలాంటి నెగిటివిటీని మైండ్ లో పెట్టుకోవడం లేదట.
కొరటాల మైండ్ మొత్తం NTR30 స్క్రిప్ట్ పైనే ఉందట, ఎన్టీఆర్ ని ఎలా చూపించాలి, ఆయన ఫాన్స్ కి మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియాలోని ఆడియన్స్ మెచ్చేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేసి ప్రోపర్ గా సెట్స్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారట. అనిరుధ్ కూడా NTR30 మ్యూజిక్ సిట్టింగ్స్ లో కొరటాలని ఇంప్రెస్స్ చేసాడనే టాక్ నడుస్తుంది. సో NTR30 తో కొరటాల అన్ని ప్రశ్నలకి పర్ఫెక్ట్ గా సమాధానాలు చెప్పాలని గట్టిగానే స్కెచ్ వేస్తున్నాడన్నమాట.