Advertisementt

స్పెషల్ సాంగ్ కోసం రష్మిక డిమాండ్

Sun 04th Dec 2022 05:45 PM
rashmika mandanna,ssmb28  స్పెషల్ సాంగ్ కోసం రష్మిక డిమాండ్
Rashmika demands huge for a special song స్పెషల్ సాంగ్ కోసం రష్మిక డిమాండ్
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న ఇప్పుడు ఈ పేరు తెగ మోగిపోతుంది. కారణం తెలుగు, తమిళ, బాలీవుడ్ లలో సినిమాలు చేస్తుంది అని కాదు.. రశ్మికని ఆమె మాతృ భాష అయిన కన్నడ ఇండస్ట్రీ బాన్ చేస్తుంది అన్న విషయంలో. ఆమె అక్కడి టాప్ ప్రొడక్షన్ హౌస్ ని, అలాగే తనకి ఛాన్స్ ఇచ్చిన దర్శక, హీరోలని కాస్త చిన్న చూపు చూస్తుంది అన్న కారణంగా కన్నడ ప్రేక్షకులతో పాటుగా, కన్నడ పరిశ్రమ కూడా గుర్రుగానే ఉంది. అదలా ఉంటే.. క్రేజీ రష్మిక తో ఇప్పుడు మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న SSMB28 లో స్పెషల్ సాంగ్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. 

రష్మిక అయితే ఈ సినిమాకి క్రేజ్ వస్తుంది, అంచనాలు పెరుగుతాయి అని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారట. పూజ హెగ్డే హీరోయిన్.. ఆమెకి పోటీగా స్పెషల్ సాంగ్ కోసం రశ్మికని దించాలనే ఆలోచనకి మహేష్ ఫాన్స్ విజిల్స్ వేస్తుంటే.. రశ్మిక్ మాత్రం SSMB28 లో స్పెషల్ సాంగ్ చెయ్యాలంటే 4 కోట్లు అడుగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ, హిందీ చిత్రం, అలాగే తమిళంలో వారసుడుతో క్రేజీ సినిమాలు చేస్తున్న తన డిమాండ్ ని బట్టి పారితోషకం తేల్చేసిందట. 

హీరో మహేష్ అయితేనేమిటి.. స్పెషల్ సాంగ్ కదా అందుకే ఇంత డిమాండ్ చేస్తున్నా అన్నట్టుగా కలరింగ్ ఇస్తుందట. మరి రష్మిక క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఊ అన్నారంటే నిజంగా రష్మిక లక్కు తోక తొక్కినట్టే. 

Rashmika demands huge for a special song :

Rashmika Mandanna demands huge for a special song in SSMB28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ