సీనియర్ హీరోలైన నాగార్జున-వెంకటేష్ లు చాలా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నారు. వెంకటేష్ రానా నాయుడు వెబ్ సీరీస్ షూటింగ్ పూర్తి చేసేసి కొత్త చిత్రం ప్రకటించకుండా ఉన్నారు. అటు నాగార్జున ఘోస్ట్ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. వెంకటేష్ ఏదో దైవ చింతన అంటున్నారు. నాగార్జున ఒక రీమేక్ తో రాబోతున్నారని అంటున్నారు. కానీ వీరిద్దరి నుండి ఇంకా సైలెన్స్ సంకేతాలే కనబడుతున్నాయి.
కానీ మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ లు మాత్రం వరస లైనప్ తో ఇప్పుడు కూడా తాము నటించిన సినిమాలతో పోటీ పడుతున్నారు. బాలయ్య వీర సింహ రెడ్డి-చిరు వాల్తేర్ వీరయ్య లతో పోటీ పడుతున్నారు. రెండూ యాక్షన్ ఎంటెర్టైనెర్స్. అంటే బాలయ్య-చిరు ఇద్దరూ వైలెంట్ గానే రాబోతున్నారు. అలాగే ఈ రెండు సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో యుద్దానికి సిద్దమయ్యాయి. అలాగే బాలయ్య నెక్స్ట్ అనిల్ రావిపూడి మూవీ మొదలు పెడుతున్నారు.
ఇక చిరు కి భోళా శంకర్ లైన్ లోనే ఉంది. తర్వాత వెంకీ కుడుములు ఇలా ఆయన లైనప్ ఆయనకి ఉంది. మరి ఈ ఇద్దరు హీరోలు వైలెంట్ గా దూసుకుపోతుంటే.. ఆ ఇద్దరు హీరోలు సైలెంట్ గా కామ్ గా ఉన్నారు.