పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ.. ఆయన సినిమాల లైనప్ మాత్రం అదిరిపోతోంది. యంగ్ హీరోల్లో ఏ హీరోలు ఇంత త్వరగా సినిమాల మీద సినిమాలు ప్రకటించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే రెండు మూడు కమిట్మెంట్ ఉన్నాయి. ఈలోపులో పాన్ ఇండియా డైరెక్టర్ సిజిత్ మరో సినిమాని ప్రకటించారు. ప్రభాస్ తో చేసిన సాహు తో హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలతో మెప్పించిన సుజిత్.. తర్వాత కామ్ గా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈరోజు డిసెంబర్ 4 ఉదయం దానయ్య ఎంటర్టైన్మెంట్ లో పవన్ కళ్యాణ్-సుజిత్ కలయికలో రాబోతున్న మూవీ అనౌన్సమెంట్ చేసారు మేకర్స్. పవన్ కల్యాణ్-సుజిత్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని పోస్టర్ ద్వారా రివీల్ చేసారు. OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అంటూ సినిమాపై ఆసక్తితో పాటుగా అదిరిపోయే ఓ హిట్ కూడా ఇచ్చేసారు. ఆ పోస్టర్ లో పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని నిల్చున్న స్టిల్ చూపించగా.. పవన్ వెనుక నీడ మాత్రం ఓ పెద్ద గన్‌లా కనిపిస్తుండడం పవన్ ఫాన్స్ కి కిక్ ఇస్తుంది.
ఇక సుజిత్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, నటుల ఎంపిక పూర్తి చేసి ఈ నెలలోనే పవన్ తో కలిసి సెట్స్ లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.