Advertisementt

పెళ్లి తర్వాత కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్

Sun 04th Dec 2022 09:48 AM
keerthy suresh,keerthy suresh wedding  పెళ్లి తర్వాత కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్
Keerthy Suresh shocking decision after marriage పెళ్లి తర్వాత కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్
Advertisement
Ads by CJ

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి కబుర్లు సోషల్ మీడియా వ్యాప్తంగా చాలానే వినిపిస్తున్నాయి. మహానటి తర్వాత మెల్లగా సక్సెస్ దారిపట్టిన కీర్తి సురేష్ పెళ్లి వార్తలతో ఆమె ఫాన్స్ డిస్టర్బ్ అవుతున్నా.. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితేనే బావుంటుంది అంటూ సర్దుకుపోతున్నారు. మొన్నామధ్యన కీర్తి సురేష్ పెళ్లి వార్తలని ఖండించిన ఆమె పేరెంట్స్ ఇప్పుడు వస్తున్న పెళ్లి ముచ్చట్లని ఖండించకపోవడంతో నిజంగానే కీర్తి సురేష్ పెళ్లి  చేసుకుంటుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే కీర్తి సురేష్ పెళ్లి పనులు మొదలైపోయినట్లుగా చెబుతున్నారు.

అయితే కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ఆమె నటించాల్సిన సినిమాలను పూర్తి చేసి నటనకు  బై బై చెప్పేస్తుంది అనే టాక్ తో పాటుగా ఆమె నటనను వదిలేసినా సినిమాలని వదిలేదెలే అంటుందట. అంటే నటనను పక్కనపెట్టి నిర్మాణ రంగంలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తుంది. నటించకపోయినా.. సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలోనే ఉండాలని ఆమె డిసైడ్ అయినట్టుగా టాక్. ఇక కీర్తి సురేష్ ఆమె బంధువుల అబ్భాయినే వివాహమాడబోతుంది అని కూడా ప్రచారమైతే గట్టిగానే జరుగుతుంది.

ఈ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ స్పందించకపోకవడంతో పెళ్లి పనులు నిజంగానే జరుగుతూన్నాయేమో అనే ఊహాగానాల్లో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం కీర్తి తెలుగులో దసరా, భోళా శంకర్ లో నటిస్తుంది.

Keerthy Suresh shocking decision after marriage:

Keerthy Suresh to quit acting after marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ