అల్లు అర్జున్ పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ కి వెళ్లే ప్లాన్ గట్టిగానే చేసుకుంటున్నాడు. ఎలాగూ పుష్ప పార్ట్ 2 తర్వాత అల్లు అర్జున్ కొరటాలతో చెయ్యాల్సిన మూవీ ఆగిపోయింది. ఆయన తదుపరి మూవీ గురించిన ప్రకటన దసరాకే రావాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 తర్వాత మూవీ ప్రకటించలేదు. ఈ మధ్యలో అల్లు అర్జున్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో రెండుమూడుసార్లు ముంబై వెళ్లి ఆయన ఆఫీస్ లో మీటవ్వడం హాట్ టాపిక్ గా నిలిచింది.
బన్నీ తదుపరి మూవీని సంజయ్ లీలా భన్సాలీతో చేసే అవకాశం ఉండబట్టే స్టోరీ సిట్టింగ్స్ కోసం ఆయన తరుచూ ముంబై వెళుతున్నారనే టాక్ నడిచింది. ఇప్పుడు మరో బాలీవుడ్ డైరెక్టర్ మీటవ్వడానికి రెడీ అయ్యారనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఆయనే టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అల్లు అర్జున్ తో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారని, ముంబై వేదికగా రోహిత్ శెట్టి-అల్లు అర్జున్ లు మీట్ అవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
మరి అల్లు అర్జున్ పుష్ప ద రూల్ తర్వాత ఖచ్చితంగా హిందీ డైరెక్టర్ తోనే సెట్స్ మీదకెళ్ళేట్టుగా కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం. అల్లు అర్జున్ రోహిత్ శెట్టిని మీటయ్యేది, ఓ బడా మల్టీస్టారర్ కోసమే అనే టాక్ కూడా బాలీవుడ్ నుండి వినిపిస్తుంది.