మహేష్ బాబు సెప్టెంబర్ లో చివరి వారంలో తల్లి ఇందిరాదేవిని పోగొట్టుకున్నారు. నెలన్నర గ్యాప్ లో సూపర్ స్టార్ తన తండ్రి కృష్ణగారికి దూరమయ్యారు. తల్లితండ్రులు కాలం చేయకముందే మహేష్ బాబు త్రివిక్రమ్ తో SSMB28 రెగ్యులర్ షూట్ లో జాయిన్ అయ్యారు. అప్పట్లో మహేష్ లుక్ పై కాస్త విమర్శలు కూడా వచ్చాయి. అలాగే మహేష్ SSMB28 ఫస్ట్ షెడ్యూల్ లో మహేష్ లుక్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే న్యూస్ నడిచింది. అయితే తల్లి, తండ్రి మరణించడంతో ఆ బాధలో ఉన్న మహేష్ తేరుకోవడానికి ఆయన పని మీద కాన్సంట్రేట్ చెయ్యాలని అనుకుంటున్నట్లుగా వార్తలొచ్చాయి.
మహేష్ అనుకున్నది 100 పర్సెంట్ కరెక్ట్. వర్క్ మూడ్ లోకి వెళితే బాధ నుండి ఉపశమనం ఉంటుంది. అనుకున్నట్టుగానే మహేష్ బాబు వర్క్ మూడ్ లోకి వచ్చేస్తూ బ్యాక్ టు వర్క్ అంటూ కొత్త లుక్ లోకి దిగిపోయారు. మహేష్ హెయిర్ స్టయిల్ ఆయన ఫిజిక్ అన్ని చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. మహేష్ హెయిర్ స్టయిల్ కి మహేష్ ఫాన్స్ ఫిదా అవుతున్నారు. అంత బావున్నారు మహేష్ కొత్త లుక్ లో. అయితే మహేష్ వర్క్ లోకి వచ్చింది SSMB28 కోసం కాదు.
ఆయన మౌంటెన్ డ్యూ యాడ్ షూట్ కోసం మౌంటెన్ డ్యూ కాస్ట్యూమ్స్ లోకి మారిపోయి Back to work!! 📸 : #SureshNatarajan అంటూ కొత్త లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అది నిమిషాల్లో వైరల్ అయ్యింది.