బిగ్ బాస్ సీజన్ 6 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్, టైటిల్ ఫెవరెట్ సింగర్ రేవంత్ తండ్రయ్యాడు. అతను బిగ్ బాస్ లో ఉన్న సమయంలోనే ఆయన భార్య అన్విత పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. డిసెంబర్ 1 రాత్రి రేవంత్ కి పాప పుట్టింది. దానితో సోషల్ మీడియాలో రేవంత్ కి అందరూ శుభాకాంక్షలు తెలియజేసారు. రేవంత్ అన్నా నువ్ విన్ అయ్యి బయటికి రా నీకు వదిన పాపతో సర్ ప్రైజ్ ఇస్తుంది. అటు కప్పు, ఇటు బేబీ నీకు అన్ని గుడ్ న్యూస్ లే అంటూ అభిమానులు హడావిడి చేస్తున్నారు.
అయితే రేవంత్ బయటికి రాకముందే బిగ్ బాస్ రేవంత్ కి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. రేవంత్ ని ఈరోజు ఎపిసోడ్ లో కన్ఫెషన్ రూమ్ కి రమ్మని అతనికి పాప పుట్టిన విషయం తెలియజేసారు. దానితో రేవంత్ ఎగ్జైట్ అయ్యి ఎమోషనల్ అయ్యాడు. హౌస్ మేట్స్ విజిల్స్ వేస్తూ ఆనందం వ్యక్తం చేసారు. నాగార్జున స్టేజ్ పై నుండి ఫస్ట్ టైమ్ అంటూ రేవంత్ భార్య అన్వితని బేబీ ని టివి స్క్రీన్ పై వీడియో కాల్ లో చూపించడంతో రేవంత్ తన కూతురిని చూసుకుని ఆనందం తట్టుకోలేకపోయాడు. ఐ లవ్ యు జూనియర్ రేవంత్ అంటారు అంటూ, నా పాపని చూడండి అంటూ క్యూట్ గా ఓ పాట పాడాడు.
ఆ సాంగ్ తర్వాత బిగ్ బాస్ నేను ఇక్కడే గెలిచాను, థాంక్యూ బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు. మిగతా హౌస్ మేట్స్ రేవంత్ కి బేబీ పుట్టడంపై సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్న ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా.