సంక్రాంతి పందెం కోళ్లు రెడీ అవుతున్నాయి, నిన్నమొన్నటివరకు సాగిన వివాదాలకు, సస్పెన్స్ లకి తెరదించుతూ మేకర్స్ ఒక్కొక్కళ్ళుగా డేట్స్ లాక్ చేస్తున్నారు. సంక్రాంతి రిలీజ్ అంటూ అందరిలో ఉత్కంఠ పెంచి డేట్స్ లాక్ చెయ్యకుండా కన్ఫ్యూజ్ చేసి.. ఇప్పుడు కన్ఫ్యూజన్ ని దూరం చెయ్యడానికి రెడీ అయ్యారు. అందరి కన్నా వెనుకగా సంక్రాంతికి వీర సింహ రెడ్డి రిలీజ్ అన్నవారు.. నేడు అందరికన్నా ముందే సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసారు. ఇప్పటికే చాలామంది జనవరి 12 న వీర సింహ రెడ్డి రిలీజ్ అంటున్నారు.
సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఇది బాలకృష్ణకు పాజిటివ్ సెంటిమెంట్. పండుగకు విడుదలైన బాలకృష్ణ అనేక సినిమాలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి. పండుగ సెలవులు సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడానికి అనుకూలంగా వుండబోతున్నాయి. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్ లో కనిపిస్తున్న ఈ చిత్రం మాసస్ లో భారీ అంచనాలని క్రియేట్ చేసింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఫైనల్ గా వీరసింహారెడ్డిజనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలకృష్ణ సీరియస్ లుక్ లో కనిపించారు. వస్తున్నా అంటూ ప్రత్యర్థులకు వేలెత్తి వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోన్న బాలకృష్ణ లుక్ టెర్రిఫిక్ గా వుంది.