Advertisementt

రెండో పెళ్లిపై మీనా ఇండైరెక్ట్ కామెంట్స్

Sat 03rd Dec 2022 12:30 PM
meena,meena reaction about her second marriage  రెండో పెళ్లిపై మీనా ఇండైరెక్ట్ కామెంట్స్
Meena reacts to her second marriage rumours రెండో పెళ్లిపై మీనా ఇండైరెక్ట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

మీనా భర్త విద్యా సాగర్ మరణించిన ఆరు నెలలు తిరక్కుండానే మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త గత కొద్దిరోజులుగా మీడియాలో వినిపిస్తుంది. మీనా విద్యా సాగర్ ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. మీనా-విద్యా సాగర్ కి ఓ పాప. పోస్ట్ కోవిడ్ సమస్యలతో విద్యా సాగర్ ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తో ఈ ఏడాది జూన్ లో మరణించారు. భర్త మరణంతో కుంగిపోయిన మీనాని మళ్ళీ మాములు మనిషిని చెయ్యాలంటే ఆమె తాను చెయ్యాల్సిన సినిమా షూటింగ్స్ కి వెళ్లి పనిలో పడాలని ఆమె స్నేహితులు చెప్పడంతో భర్త పోయిన మూడు నెలలకే మీనా షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

మళ్ళీ ఇన్ని రోజులకి ఆమె రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాని కమ్మేసింది. మీనా ఫ్రెండ్ మీనా రెండో పెళ్లి చేసుకుంటుంది అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆమె ఎలాంటి పెళ్లి చేసుకోవడం లేదు. ఒకవేళ రెండో పెళ్లి చేసుకుంటే ఆమె మీకు ముందుగానే చెప్పి చేసుకుంటుంది. ఇలాంటి చెత్త న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యకండి అని చెప్పింది. అయితే తాజాగా మీనా ఆమె రెండో పెళ్లి వార్తలపై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తన భర్త విద్యా సాగర్ మరణం అనే చేదు వార్త నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

ఇలాంటి కఠినమైన సమయంలో వ్యక్తిగత విషయాలకు ప్రైవసీ కలిగిస్తే బావుంటుంది. పిచ్చి పిచ్చి రాతలతో బాధపెట్టవద్దు అంటూ మీనా రెండో పెళ్లి విషయంలో పూర్తిగా క్లారిటీ ఇస్తూ వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. అలా మీనా బాధపడుతూ ఉండడం చూసి ప్లీజ్ ఆమెపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యకండి అంటూ నెటిజెన్స్ మీనాకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Meena reacts to her second marriage rumours:

Meena Reaction About her Second Marriage News

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ