Advertisementt

బిగ్ బాస్ 6: ముందే ఊహించి డల్ అయ్యింది

Sat 03rd Dec 2022 11:33 AM
bigg boss 6,faima  బిగ్ బాస్ 6: ముందే ఊహించి డల్ అయ్యింది
Bigg Boss 6: Faima To Get Eliminated In This Week బిగ్ బాస్ 6: ముందే ఊహించి డల్ అయ్యింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గత వారమే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లాల్సిన ఫైమా అదృష్టం కొద్దీ ఏవిక్షన్ పాస్ వలన బ్రతికి పోయింది. కానీ ఈ వారం ఎక్కడ వెళ్ళిపోతానో అని నామినేట్ చేసిన రేవంత్ పై అర్ధం పర్థం లేని మాటలతో విరుచుకుపడింది. ఇక నామినేషన్స్ లోకి వచ్చాక ఫైమా మరింత డల్ అయ్యింది. ఆమె చేసే కామెడీ అలాగే టాస్క్ విషయంలో ఆమె పోరాటంలో ఎలాగో ఈ చివరి వారాల వరకు వచ్చినా ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకునేలా కనిపించడం లేదు. శ్రీ సత్య ఫైమా కన్నా వీక్ గా ఉన్న ఆమె అందం, ఆమె గ్లామర్ షో ఆమెని కాపాడింది.

డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. అదే నిజమైతే ఫైమా తో పాటుగా శ్రీ సత్య కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అయితే ఫైమా ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతాను అని ఫిక్స్ అయ్యింది. అందుకే బాగా డల్ గా కనిపిస్తుంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లోను ఎలాగోలా ఈ టాస్క్ లో గెలిచి టికెట్ ఫినాలే టాస్క్ ని దక్కించుకోవాలనుకుంది. అందుకే నిన్న ఎపిసోడ్ లో జరిగిన టాస్క్ లో ఫైమా మొండిగా ఆమెని తప్పించినా అందరితో వాదిస్తూ ఆడతాను అంటూ కూర్చుంది. చివరికి ఆది రెడ్డి, రేవంత్-శ్రీహన్ ఆడారు. అందులో రేవంత్-శ్రీహన్ గెలిచి ఫైనల్స్ కి వెళ్లారు.

కానీ ఫైమా మాత్రం ఆ టికెట్ టు ఫినాలే గెలవాలని ఆశపడింది. అది గెలవలేకపోయేసరికి.. ఈ వారం ఎక్కడ వెళ్ళిపోతాననో అనే బెంగలోనే కనబడింది. ఈ వారం ఖచ్చితంగా, ఫైమా అనుకోవడమే కాదు, ఈమె ఎలిమినేట్ అవుతుంది అని అందరూ ఓ అంచనాకు వచ్చేసారు.

Bigg Boss 6: Faima To Get Eliminated In This Week:

Bigg Boss 6: This Week highlights

Tags:   BIGG BOSS 6, FAIMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ