మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ శంకర్ తో చేస్తున్న RC 15 షూటింగ్ లో పాల్గొంటూ మధ్య మధ్యలో వెకేషన్స్ అంటూ ఫ్యామిలీతో తిరుగుతూ బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా రామ్ చరణ్ కి ట్రూజెట్ అవార్డు వచ్చింది. ఆయన రీసెంట్ గా ఆ అవార్డు కూడా అందుకున్నారు. చరణ్ ట్రూజెట్ అవార్డు అందుకోవడం పట్ల చిరు గర్వంగా ట్వీట్ చేసారు.
Nanna,
Absolutely thrilled for you and proud, on winning the #TrueLegend -
#FutureOfYoungIndia Award #NDTV
Bravo!!! 👏👏 Way to go, dearest
@AlwaysRamcharan
- Appa & Amma
కంగ్రాట్స్ చరణ్, ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియాలో ట్రూ జెట్ అవార్డు అందుకున్నందుకు నేను గర్వంగా ఫీలవుతున్నా. నువ్వు ఇలానే ముందు సాగాలంటూ నేనూ అమ్మ కోరుకుంటున్నాం.. అంటూ తన భార్య సురేఖతో కలిసి ఉన్న చరణ్ చిన్నప్పటి పిక్ ని, అలాగే చరణ్ అవార్డు అందుకున్న పిక్ ని షేర్ చేసిన చేసిన ట్వీట్ వైరల్ కాగా.. దానికి చరణ్ లవ్ యు అప్పా అంటూ రిప్లై ఇచ్చాడు.