Advertisementt

ఇంట్రెస్టింగ్: హిట్ 3 లో హీరోగా సమంత

Sat 03rd Dec 2022 10:33 AM
samantha,adivi sesh,hit 3  ఇంట్రెస్టింగ్: హిట్ 3 లో హీరోగా సమంత
Samantha to join HIT universe soon? ఇంట్రెస్టింగ్: హిట్ 3 లో హీరోగా సమంత
Advertisement
Ads by CJ

హీరో నాని నిర్మాతగా హిట్ సీరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేస్తున్నాడు. విశ్వక్ సేన్ తో హిట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాని, అడివి శేష్ తో దానికి సీక్వెల్ గా హిట్ 2 తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దానితో హిట్ సీరీస్ పై అందరిలో ఆసక్తి ఆత్రుత మొదలయ్యాయి. హిట్ 2 ప్రమోషన్స్ లోనే ఈ సీరీస్ పరంపర కొనసాగుతుంది అన్నారు. ఇప్పుడు హిట్ 2 నాని-అడివి శేష్ కూడా ఊహించని హిట్ కొట్టడంతో.. అందరిలో హిట్ 3 పై ఆసక్తిపై మొదలైపోయింది. హిట్ 2 లోనే హిట్ 3 పై క్లూ ఇచ్చి నాని అర్జున్ గా ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఓ సీనియర్ జర్నలిస్ట్ హిట్ 3 లో సమంత హీరో అయితే ఎలా ఉంటుంది, అదిరిపోతోంది కదా అని ట్వీట్ చెయ్యగానే.. దానికి అడివి శేష్ కూడా ఆసక్తికరమైన రిప్లై ఇచ్చాడు. That’s a terrific idea! What do you say Sam? @Samanthaprabhu2 ఐడియా బావుంది.. నువ్వేమంటావ్ సామ్ అంటూ అడివి శేష్ అడిగాడు. మరి హిట్ 3 లో సమంత హీరోగా కనిపిస్తే బావుంటుంది అంటూ నెటిజెన్స్ కూడా అడివి శేష్ కామెంట్ కి మద్దతు తెలుపుతున్నారు.

ఇప్పటికే సమంత యశోద లో అండర్ కవర్ పోలీస్ గా అదరగొట్టేసింది. మరి హిట్ 3 లో సమంత గనక పోలీస్ ఆఫీసర్ గా దిగితే.. ఆ క్రేజే వేరు, ఆ మజానే వేరు అంటూ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. 

 

Samantha to join HIT universe soon?:

Samantha to join hands with Adivi Sesh for next film of HIT universe

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ