ఈ రోజు శుక్రవారం బాక్సాఫీసు దగ్గర రెండు సినిమాలు పోటీ పడ్డాయి. నాని నిర్మాతగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ ద ఫస్ట్ కేస్, రవితేజ-విష్ణు విశాల్ నిర్మాతలుగా విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన మట్టి కుస్తీ. ఈ రెండు సినిమాలు హిట్ అవుతాయని అందరూ అనుకున్నారు. హీరోలు కూడా అనుకున్నారు. నాని కథల ఎంపికలో చాలా బ్యాలెన్సుడ్ గా జెడ్జ్ చేస్తాడు. ఆయన నిర్మాతగా మారి చేసిన సినిమాలు అది నిరూపించాయి. ఆ విషయంలో నాని మరోసారి హిట్ 2 తో శెభాష్ అనిపించాడు. హిట్ 2 తో హిట్టు కొట్టేసాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో అడివి శేష్ KD గా ఇరగదీసాడు. అంతేకాకుండా హిట్ 2 కి సూపర్ హిట్ రివ్యూస్ క్రిటిక్స్ నుండి రావడంతో నాని-అడివి శేష్ సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ చీర్స్ కొట్టుకున్నారు.
ఇక రవితేజ-విష్ణు విశాల్ ల మట్టి కుస్తీ కూడా ఈ రోజే విడుదలయ్యింది. రవితేజ మొదటిసారి నిర్మాతగా మారి, విష్ణు విశాల్ తో కలిసి మట్టి కుస్తీని నిర్మించాడు. రవితేజ కూడా ఆషామాషీ హీరో కాదు. కథల ఎంపికలో ఆరితేరిపోయాడు. అలాంటి రవితేజ నుండి సినిమా వస్తుంది అంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాపై ఆసక్తి పెంచుకోవడం ఖాయం. అటు విష్ణు విశాల్ కూడా సాదా సీదా హీరో కాదు, విష్ణు విశాల్ తమిళ్ లో పేరున్న హీరో. అందుకే మట్టి కుస్తీపై అంచనాలు ఉన్నాయి. కానీ రవితేజ మట్టి కుస్తీ కథ విషయంలో తప్పటడుగు వేసాడేమో అనిపించింది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు మట్టి కుస్తీ నిలబెట్టుకోలేదు. ఎందుకంటే మట్టి కుస్తీ తెలుగు ప్రేక్షకులకి అంతగా రుచించలేదు.
సో హిట్ 2 తో హిట్ కొట్టి నాని హ్యాపీ గా సెలెబ్రేషన్స్ చేసుకుంటే.. రవితేజ నిర్మాతగా మట్టి కుస్తీతో సో సో టాక్ తో సైలెంట్ మోడ్ లో ఉండిపోయాడు.