మెగా బ్రదర్ ఇప్పుడు తమ తమ సినిమాల షూటింగ్స్ తో బిజీగా వున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ చిత్రం వాల్తేర్ వీరయ్య షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉండగా, పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీగా వున్నారు. సమయం ఉన్నప్పుడు రాజకీయాలు, ఇటు షూటింగ్ తో పవన్ కళ్యాణ్ హడావిడి పడుతున్నారు. అయితే మెగా బ్రదర్స్ ఇద్దరూ షూటింగ్స్ తో ఒకే ఏరియాలో ఉండడం హైలెట్ అయ్యింది. వాల్తేర్ వీరయ్య కోసం బాబీ రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి.. చిరు-రవితేజ కలయికలో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ఆల్మోస్ట్ వాల్తేర్ వీరయ్య షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని తెలుస్తుంది.
మరోపక్క హరి హర వీరమల్లు కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. దర్శకుడు క్రిష్ హరి హర వీరమల్లు యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్, వందలాదిమంది జూనియర్ ఆర్టిస్ట్ ల మధ్యన ఈ సన్నివేశాలు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు హరి హర వీరమల్లు ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాల చిత్రీకరణగా తెలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో వీరమల్లు గెటప్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్ వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇలా పవన్ కళ్యాణ్-చిరంజీవి ఇద్దరూ రామోజీ ఫిలిం సిటీలోనే ఉండి వేర్వేరు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారన్నమాట.