Advertisementt

బిగ్ బాస్ 6: రేవంత్ vs శ్రీహన్

Fri 02nd Dec 2022 07:50 PM
bigg boss 6,revanth,srihan  బిగ్ బాస్ 6: రేవంత్ vs శ్రీహన్
Bigg Boss 6: Revanth vs Srihan బిగ్ బాస్ 6: రేవంత్ vs శ్రీహన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక రెండు మూడు వారాల పాటు మాములుగా ఉన్న సింగర్ రేవంత్-శ్రీహన్ లు తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. శ్రీ సత్య-అర్జున్ కళ్యాణ్-రేవంత్ లు ఫ్రెండ్స్. కానీ అర్జున్ కళ్యాణ్ కన్నా ఎక్కువగా శ్రీహన్ రేవంత్ కి ఫ్రెండ్ గా మారాడు. ఇద్దరి మధ్యలో చిలిపి తగాదాలు, పంచాయితీలు అంటూ వారి కంటెంట్ వారు ఇస్తున్నారు. టాస్క్ ల్లో ఫ్రెండ్ షిప్ కాకుండా ఎనిమీస్ గానే తలపడే వీరిద్దరి మధ్యన టికెట్ ఫినాలే టాస్క్ ఫైనల్ జరిగినట్టుగా ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ముగ్గురు మాత్రమే ఫైనల్స్ కి వెళ్ళాలి, ఐదుగురిలో ఇద్దరు ఆగిపోవాలి అనగానే.. ఫైమాని, రోహిత్ ని ఆగమన్నారు. ఎందుకంటే వాళ్ళు లీస్ట్ లో ఉన్న కారణంగా. కానీ ఫైమా నేను ఆడతాను అంది, అది రెడ్డి, శ్రీహరిన్, రేవంత్ అందరూ గొడవపడ్డారు.

చివరికి బిగ్ బాస్ ఇనాయ, కీర్తి, శ్రీ సత్యలని నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఆడేది ఎవరో చెప్పమనగానే లీస్ట్ లో ఉన్న ముగ్గురూ ఫైమా, రోహిత్, రేవంత్ లని టాస్క్ ఆడమని చెప్పగానే ఆది రెడ్డి, శ్రీహన్ గొడవ పెట్టుకున్నారు. ఆది రెడ్డి అయితే ఈ సీజన్ లో వరెస్ట్ నిర్ణయం అనేశాడు. ఫైమా ఆడేసి టాప్ 1 లోకి వస్తే ఎలా అంటూ నిలదీశారు. దానితో ఇనాయ గొడవ పడగా.. ఇది ఫెయిర్ గేమ్ కాదు అంటూ రోహిత్ గేమ్ నుండి తప్పుకున్నాడు. తర్వాత రేవంత్, ఆది రెడ్డి, శ్రీహన్ లు పోటీ పడమని చెప్పగానే ఫైమాని ఎందుకు తీసేసారు అంటూ రోహిత్ ఇనాయతో గొడవపడి.. మీ డెసిషన్ అన్ ఫెయిర్ అంటూ ఫైట్ చేసాడు.

బిగ్ బాస్ హౌజ్ లో ఏకాభిప్రాయం అనే రచ్చ మొదలైంది. చివరికి ఆది రెడ్డి, ఫైమా, రోహిత్ తప్పుకోగా.. ఫైనల్ రౌండ్ లో శ్రీహాన్, రేవంత్ లు టాస్క్ లో పోటీ పడినట్లు తెలుస్తోంది. హోరా హోరీగా జరిగిన ఈ టాస్క్ లో శ్రీహాన్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి టాప్ 5 లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ గా నిలిచినట్లుగా బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అలాగే లక్కీగా అతను నామినేషన్స్ లో కూడా లేడు.

Bigg Boss 6: Revanth vs Srihan:

Bigg Boss 6 latest promo highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ