నందమూరి నటసింహం బాలయ్య తనయ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి గురించి తెలియని వారుండరు. వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకుని.. హెరిటేజ్ ఫుడ్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా.. మగవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకెళుతోంది. ఒక్క వ్యాపార రంగమే కాకుండా.. ఆమెలో మరో టాలెంట్ కూడా ఉందని చాటి చెబుతూ.. హిమాలయాల్లో బైక్ రైడ్ చేస్తూ బ్రాహ్మణి అందరికి షాకిచ్చింది. ధైర్యానికి మారు పేరు.. ఈ నారా వారి కోడలు.. అనేలా మాట్లాడుకునేలా చేసింది.
ఇటీవల యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్(YPO) ద లఢక్ క్వెస్ట్ పేరుతో నిర్వహించిన బైక్ రైడ్‌లో నారా బ్రాహ్మణి కూడా పాల్గొంది. ఈ ఆర్గనైజేషన్‌కు యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈవోలు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ బైక్ రైడ్‌కి సంబంధించిన జావా యెడ్జి మోటార్ సైకిల్స్ అనే సంస్థ.. ఓ షార్ట్ ఫిలింని రూపొందించింది. అత్యంత ప్రమాదకరమైన మౌంటైన్స్ వద్ద కూడా ఎంతో సునాయాసంగా బైక్ రైడ్ చేస్తూ యంగ్ పారిశ్రామిక వేత్తలను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ రైడ్ గురించి నారా బ్రాహ్మణి ఏం చెప్పిందంటే... ఇప్పుడు సమయం 6:30 గంటలైంది. లఢక్ చాలా అద్భుతంగా, ఎంతో అందంగా ఉంది. ధక్ సే ఆరామానికి బయలుదేరుతున్నాం. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక భావనని అందుకోనున్నాం. అక్కడ ధ్యానం చేస్తాం... అని తెలిపింది. ఈ వీడియోలో రైడ్‌లో పాల్గొన్న వారంతా తమ తమ మనోభావాలను, అనుభవాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.