అక్కినేని హాస్పిటల్ పై ఈడీ దాడులు అనగానే అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సంబందించిన హాస్పిటల్ పై దాడులు అనుకునేరు.. మీడియాలో అక్కినేని ఆసుపత్రిపై దాడులు అని చూడగానే చాలామంది పొరబడుతున్నారు కూడా. కానీ అక్కినేని ఫ్యామిలీ ఆసుపత్రి కాదు, విజయవాడలోని ఓ NRI డాక్టర్ అక్కినేని మణి గారి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ మీద ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం నుండి దాడులు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలో NRI ఆసుపత్రిలో పని చేసే అక్కినేని మణి.. విజయవాడలో అన్ని అవసతులతో కూడిన అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని 2022 లో అంటే ఈ ఏడాది ఆగష్టు 21 న ప్రారంభించారు.
అయితే అక్కినేని ఆసుపత్రికి మణి విదేశీ పెట్టుబడులు తీసుకున్నట్టుగా, అలాగే NRI మెడికల్ కాలేజ్ సీట్ల విషయంలో కోట్లాదిరూపాల నిధుల మల్లింపు, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే అనుమానంతో ఈడీ అక్కినేని ఆసుపత్రి పై దాడులు నిర్వహించింది. ఆసుపత్రిలోకి ఎవరిని వెళ్లనివ్వకుండా సీఆర్పీఎఫ్ సిబ్బందితో గట్టి బందోబస్ట్ ఏర్పాటు చెయ్యడమే కాకుండా, అక్కడి సిబ్బంది నుండి ఫోన్ తీసేసుకుని విచారణ చేపట్టారు.
ఈడీ అధికారులు అక్కినేని మణి ని కారులో ఎక్కించుకుని విచారణకు తీసుకుని వెళ్లినట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రి డైరెక్టర్స్ ని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఆంధ్రలోని చాలా హాస్పిటల్స్ పై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.