బాలనటిగా హిందీలో పలు సీరియల్స్ లో నటించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఓ ఊపుఊపేసిన ముంబై ముద్దుగుమ్మ హన్సిక మొత్వానీ... పెళ్లి పీటలెక్కబోతోన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాలు, సీరియల్స్ మాత్రమే కాకుండా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో ఓ యాడ్‌లో కూడా నటించి.. అప్పట్లో సెన్సేషన్ అయింది. 15 సంవత్సరాల వయసులోనే తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశ ముదురు చిత్రంలో నటించింది. అదే ఆమె తొలి తెలుగు చిత్రం. ఇప్పటి వరకు పలు తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. రీసెంట్‌గా ఆమె నటించిన 50వ చిత్రం విడుదలై.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం ఆమె ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్‌నర్ అయిన సొహైల్ కతూరియాని డిసెంబర్ 4న రాజస్థాన్ లోని ఒక రాయల్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకోనుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి కూడా. ఈ సందర్భంగా ఆమె తన స్నేహితులతో కలిసి గ్రాండ్ గా బ్యాచులర్ పార్టీ జరుపుకుంది. ఆ పార్టీలో హన్సిక ధరించిన డ్రెస్ అందరిని ఆకట్టుకుంది. డిసెంబర్ 1 సాయంత్రం హన్సిక మెహందీ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుపుకుంది. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హన్సిక ఫ్యామిలీ అంతా జైపూర్ చేరుకొని పెళ్ళికి సంబంధించిన పూజా కార్యక్రమాలని వధూవరులతో జరిపించడం జరిగింది. పెళ్లి అనంతరం ఆమె సినిమాలకు బై బై చెప్పేసి బిజినెస్ వ్యవహారాలు చూసుకోనుందనేలా టాక్ నడుస్తోంది.