Advertisementt

నమ్రత పేరుతో మహేష్ రెస్టారెంట్ బిజినెస్

Fri 02nd Dec 2022 11:59 AM
mahesh babu,namrata,asian,an restaurant opening  నమ్రత పేరుతో మహేష్ రెస్టారెంట్ బిజినెస్
Mahesh Babu new restaurant open on నమ్రత పేరుతో మహేష్ రెస్టారెంట్ బిజినెస్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటిస్తూనే వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమాల్లో నటించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మహేష్ వంతు. మహేష్ వ్యాపారాలను మానేజ్ చేసేది ఆయన భార్య నమ్రత. మహేష్ బాబు నటిస్తూ కూల్ గా సినిమాలు చేస్తున్నారంటే ఆయన భార్య నమ్రతనే కారణం. పలు వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఆవిడ. ఇక ఏషియన్ సునీల్ వాళ్లతో కలిసి AMB మల్టిప్లెక్స్ లో భాగస్వాములైన మహేష్ బాబు ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగారు.

హైదరాబాదు సిటీలో ఏషియన్స్ వారితో కలిసి మహేష్ తన భార్య నమ్రత పేరు మీదగా AN(ఏషియన్స్, నమ్రత)రెస్టారెంట్ ప్రారంభించారు. అన్ని వసతులతో కూడిన ఈ రెస్టారెంట్ పూజా కార్యక్రమాలు డిసెంబర్ 8 న జరగనున్నాయి. మహేష్ తల్లితండ్రులు ఈ మధ్యనే మరణించడంతో మహేష్-నమ్రతలు పూజా కార్యక్రమాలకు దూరంగా ఉంటారని.. ఏషియన్స్ వారు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ రెస్టారెంట్ గ్రాండ్ గా ప్రారంభిస్తారని తెలుస్తుంది.

Mahesh Babu new restaurant open on:

Namrata-Asian AN restaurant opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ