Advertisementt

తండ్రయిన బిగ్ బాస్ రేవంత్

Fri 02nd Dec 2022 10:47 AM
bigg boss,revanth,anvitha  తండ్రయిన బిగ్ బాస్ రేవంత్
Bigg Boss 6 Telugu: Singer Revanth Blessed With Baby Girl తండ్రయిన బిగ్ బాస్ రేవంత్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 6 లోకి టైటిల్ ఫెరవేట్ గా దిగిన రేవంత్.. టాస్క్ ల విషయంలో వీరోచితంగా పోరాడుతున్నాడు. అయితే రేవంత్ భార్య అన్విత, రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేముందే ప్రెగ్నెంట్. మధ్యలో ఆమె సీమంతం ఫంక్షన్ ని రేవంత్ కి చూపించారు బిగ్ బాస్. భార్య విషయంలో రేవంత్ అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ ఎపిసోడ్ లో రేవంత్ భార్య వీడియో కాల్ చేసింది. తర్వాత తన ఫ్రెండ్స్ తో, తన బ్రదర్ తో కూడా అన్వితని బాగా చూసుకోండి, తన దగ్గరే ఉండండి అని చెప్పాడు రేవంత్. ఈరోజు డిసెంబర్ 2 రేవంత్ తండ్రి అయిన విషయం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు రేవంత్ కుటుంబ సభ్యులు.

అన్విత పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. రేవంత్-అన్విత తల్లితండ్రులయ్యారు.. అన్న విషయం తెలుసుకున్న ఫాన్స్, రేవంత్ అన్నా నువ్ బయటికి వచ్చేసరికి నీకు సర్ ప్రైజ్, నువ్ విన్ అయ్యి కప్ పట్టుకుని వచ్చి నీ కూతురిని ఎత్తుకునే మధుర క్షణాలు నీ కోసం వైట్ చేస్తున్నాయి, కంగ్రాట్స్ రేవంత్ అన్నా, అన్విత వదిన, మీకు శుభాకాంక్షలు అంటూ రేవంత్ ఫాన్స్, రేవంత్ ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియా ద్వారా రేవంత్ కి అన్వితకి విషెస్ తెలియజేస్తున్నారు. 

Bigg Boss 6 Telugu: Singer Revanth Blessed With Baby Girl:

Bigg Boss Singer Revanth And Anvitha Blessed With Baby Girl

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ