Advertisementt

పూనం కౌర్ ఆరోగ్యంపై ప్రెస్ నోట్

Thu 01st Dec 2022 07:07 PM
poonam kaur,poonam kaur health update  పూనం కౌర్ ఆరోగ్యంపై ప్రెస్ నోట్
Press note on Poonam Kaur health పూనం కౌర్ ఆరోగ్యంపై ప్రెస్ నోట్
Advertisement
Ads by CJ

నటి పూనమ్ కౌర్ అనారోగ్యంతో కేరళలోని ఆయుర్వేద వైద్య శాలలో చికిత్స తీసుకుంటుంది అంటూ ఈ రోజు గురువారం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దానితో ఆమె అభిమానులు పూనమ్ కి అసలేమైంది అంటూ ఆరాలు మొదలు పెట్టారు. ఇంతలోపులో పూనమ్ కౌర్ పిఆర్ టీం ఆమె హెల్త్ పై ఓ ప్రెస్ నోట్ ద్వారా అప్ డేట్ ఇచ్చింది.

గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్ కౌర్ నవంబర్ 10వ తేదీన మాతో కలిసి సూరత్  గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నది. 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం 12వ తేదీ ఢిల్లీలో జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్ళింది. 

ఢిల్లీ లో ఆమెకు వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు 18వ తేదీన ఫైబ్రో మయాల్జియా నిర్ధారణ అయ్యింది. కేరళలో ట్రీట్మెంట్ అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె పూర్తి ఆత్మిశ్వాసంతో వున్నారు.. అంటూ జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త  యర్రమాద వెంకన్న నేత తెలియజేసారు.

Press note on Poonam Kaur health:

Poonam Kaur health update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ