ఇప్పటివరలు లైగర్ డిజాస్టర్ ఎఫెక్ట్ పూరి కి ఛార్మికి ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే దర్శకుడిగా పూరి కి నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చే హీరో దొరకాలి, లైగర్ చూసాక ఎవరు ధైర్యం చేస్తారు. అలాగే నిర్మాతగా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నాడు పూరి. లైగర్ ఎఫెక్ట్ మొత్తం పూరి మీదే పడింది అనుకుంటే.. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ పై పడబోతుందనిపిస్తుంది. నిన్నటివరకు లైగర్ పోతేనేమి.. నెక్స్ట్ మూవీ తో గట్టిగా కొడదామని రిలాక్స్ అయిన విజయ్ దేవరకొండ కి ఆ డిసాస్టర్ ఎఫెక్ట్ తగిలింది.
కారణం విజయ్ దేవరకొండ ఈడి విచారణకు హాజరవడమే. అంటే లైగర్ పారితోషకం లెక్కలైతే విజయ్ సేఫ్. కానీ లైగర్ బడ్జెట్ విషయాలని, విజయ్ దేవరకొండ బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ అధికారులు తనిఖీ చేసారంటే ఎక్కడో తేడాకొడుతుంది అనే టాక్ మొదలయ్యింది. అంటే విజయ్ దేవరకొండ కి లైగర్ పెట్టుబడితో సంబంధం ఉందా? లేదంటే ఇతర కారణాల వలన విజయ్ ని పిలిపించారో కానీ.. ప్రస్తుతం లైగర్ డిసాస్టర్ ఎఫెక్ట్ మాత్రం విజయ్ పై పడేలా ఉంది. ఎఫెక్ట్ అంటే అతని నెక్స్ట్ సినిమా బిజినెస్ పై ఆ ప్రభావం చూపించడం లాంటివి.
హిట్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా, లేదంటే స్టార్ డైరెక్టర్ తో విజయ్ మూవీ మొదలు పెట్టినా, ఆ క్రేజీ కాంబో మొదలై క్రేజ్ పెంచితే ఆటోమాటిక్ గా విజయ్ మీద అందరి చూపు పడుతుంది.. అదేమంత పెద్ద విషయం కాదు.