బిగ్ బాస్ ని రూల్ చేస్తాను, బిగ్ బాస్ కే గేమ్ నేర్పిస్తాను, సంచాలక్ గా అట ఆడిస్తాను, నేనే తోపు, తురుము అంటూ రెచ్చిపోయి మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి బిగ్ బాస్ స్టేజ్ పైనే అతి చేసింది. ఆఖరికి నాగార్జున ఓదార్చినా గీతూ ఏడుపు ఆగలేదు. మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి టాప్ 10 కి కూడా వెళ్ళలేకపోయాను, సో నేను ఓడిపోయాను బిగ్ బాస్ అంటూ ఏడుస్తూనే కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలో ఉండి డిప్రెషన్ లోకి వెళ్లిన గీతూ నాలుగు రోజుల తర్వాత ఓ వీడియో ని యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. తాను ఎన్ని రోజులైతే బిగ్ బాస్ లో ఉందో అన్ని రోజుల బిగ్ బాస్ రివ్యూ ని ఆ వీడియోలో చెప్పింది.
తర్వాత ఇన్స్టా లైవ్ లో మాట్లాడింది. తాజాగా తనకి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున నుండి పిలుపొచ్చినట్టుగా చెప్పింది. తాను డిప్రెషన్ లో ఉన్నాను అని తెలుసుకుని నాగ్ సర్ నన్ను పిలిపించారు. నేను బిగ్ బాస్ సెట్స్ కి వెళ్లి నాగ్ సర్ ని కలిసాను. అప్పుడు కూడా బాగా ఏడుపొచ్చింది, నాగార్జున గారు మళ్ళీ ఓదార్చారు. ప్రేమ, బాధ రెండూ ఒకటే, ఏదైనా బయటికి చూపించాలి అని తెలిసి వచ్చింది. ఆది రెడ్డికి నాగ్ సర్ క్లాస్ ఇవ్వక ముందే నాగ్ సర్ ని కలిసాను అని చెప్పింది. ఇప్పుడు 20 రోజుల తర్వాత బయటికి వచ్చాను. ఎందుకంటే నా హెయిర్ కి కలర్ వేయించుకోవడానికి, అలాగే నా కాలు మీద టాటూ వేయించుకోవడానికి. నాకు నచ్చని పనులు మొదటిసారి చేస్తున్నా.. కాలికి సైలెన్సర్ కాలిన మచ్చని కవర్ చెయ్యడానికి చిరుత మచ్చలతో టాటూ వేయించాను అంటూ ఆ వీడియో ని ఇన్స్టా లో పోస్ట్ చేసింది.
అలానే బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ చూసినప్పుడు బాధనిపించింది. అమ్మకి మంచి చీర కొని పెట్టి ఆ ఎపిసోడ్ లోకి రమ్మని చెప్పి ఉన్నాను, కానీ నేను ఎలిమినేట్ అయ్యి వచ్చేసాను అంటూ మరోసారి ఎమోషనల్ అయ్యింది.