ఈమధ్యన హీరోయిన్స్ చాలామంది వయసు మీద పడినా పెళ్లి పేరు ఎత్తగానే కయ్యమంటున్నారు. త్రిష, తమన్నా, అనుష్క ఇలా ఈ కోవలో చాలామందే ఉన్నారు. మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా కియారా అద్వానీ కూడా పెళ్ళికి సిద్ధమవుతుంది, లవర్ సిద్దార్థ్ మల్హోత్రాతో సీక్రెట్ వెడ్డింగ్ కి ప్లాన్స్ సిద్ధం చేస్తుంది అనే న్యూస్ నడుస్తున్న సమయంలో మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో కనిపించింది. మొన్నామధ్యన కీర్తి సురేష్ పెళ్లి పై వచ్చిన వార్తలను ఆమె పేరెంట్స్ కొట్టి పారేసారు.
పేరెంట్స్ కోరుకున్నట్లే నటి గా మారి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తల్లితండ్రుల కోరిక మేరకే పెళ్లి పీటలెక్కబోతుంది, ఇప్పటికే కీర్తి సురేష్ పెళ్లి పనులు మొదలై పోయాయి అంటూ ప్రచారం గట్టిగా మొదలయ్యింది. కీర్తి సురేష్ పెళ్లి సెటిల్ రావడంతోనే గుళ్ళు గోపురాల వెంట తిరుగుతుంది, అందుకే ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోవడానికి కథలు వినడానికి కూడా సుముఖంగా లేదు అని, ఆమె పెళ్లి తరవాత నటనకు బై బై చెప్పే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు.
కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఓ వ్యాపారవేత్తని, పేరెంట్స్ చూసిన సంబంధాన్ని కీర్తి ఓకె చేసింది, అది కూడా కీర్తి సురేష్ బంధువుల అబ్బాయినే కీర్తి వివాహం చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే నాని దసరా, అటు భోళా శంకర్ షూటింగ్ ని కీర్తి త్వరత్వరగా చుట్టేస్తోంది అనే టాక్ వినిపిస్తుంది.