Advertisementt

యాక్షన్ ప్లాన్ లో SSMB28

Wed 30th Nov 2022 02:11 PM
ssmb28,mahesh babu  యాక్షన్ ప్లాన్ లో SSMB28
SSMB28 shooting update యాక్షన్ ప్లాన్ లో SSMB28
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో ఈమధ్యనే మొదలైన SSMB28 షూటింగ్ కి అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. జూన్ లోనే మొదలు కావాల్సిన SSMB28 రెగ్యులర్ షూటింగ్ అలా అలా సెప్టెంబర్ లో మొదలయ్యింది. అదైనా సజావుగా సాగిందా.. అంటే లేదు. మధ్యలో మహేష్ బాబు త్లలి పోవడం, ఈమధ్యన తండ్రి మరణించడంతో మహేష్ బాబు బాగా కుంగిపోయారు. దానితో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. మహేష్ బాబు మాములు మనిషి అవ్వాలంటే షూటింగ్ చెయ్యడం ఒకటే మార్గమని సెకండ్ షెడ్యూల్ కోసం త్రివిక్రమ్ ఏర్పాట్లు మొదలు పెట్టారు.

డిసెంబర్ 8 నుండి మహేష్ బాబు SSMB28 సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ని యాక్షన్ సీన్స్ తో ముగించిన మహేష్-త్రివిక్రమ్ మరోసారి యాక్షన్ చిత్రీకరణతో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చేసిన త్రివిక్రమ్ సెకండ్ షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే ప్లాన్ చేసారు. పుట్టెడు దుఃఖం లోను మహేష్ బాబు షూటింగ్ కి హాజరడంపై ఆయన ఫాన్స్ ఓ పక్కన సంతోషపడుతున్నా మరోపక్క మధనపడుతున్నారు.

ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ తర్వాత హీరోయిన్ పూజ హెగ్డే కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందట. అప్పుడు మహేష్-పూజ హెగ్డే లపై కొన్ని కీలక సన్నివేశాలను త్రివిక్రమ్ చిత్రీకరిస్తారని తెలుస్తుంది.

SSMB28 shooting update :

SSMB28 second schedule update

Tags:   SSMB28, MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ