Advertisementt

బ్రేకింగ్: ఈడీ ఆఫీస్ లో విజయ్ దేవరకొండ

Wed 30th Nov 2022 01:14 PM
vijay deverakonda,ed office  బ్రేకింగ్: ఈడీ ఆఫీస్ లో విజయ్ దేవరకొండ
Vijay Deverakonda to face ED questioning బ్రేకింగ్: ఈడీ ఆఫీస్ లో విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

లైగర్ డిసాస్టర్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లకుండా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ.. కొత్త సినిమా షూటింగ్ కోసం ఎదురు చూడడమే కాదు.. మధ్యలో అవార్డు ఫంక్షన్స్ కి వెళుతూ.. పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొంటూ తాను ఇంకా హుషారుగానే ఉన్నాను అంటూ రౌడీ ఫాన్స్ కి సంకేతాలు ఇస్తున్న విజయ్ దేవరకొండ కి ఈడీ షాకిచ్చింది. లైగర్ పెట్టుబడుల విషయంలో దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్ తో పాటుగా మరో నిర్మాత ఛార్మిని కూడా ఈడీ విచారణ చేసింది. లైగర్ పెట్టుబడుల విషయంలో పూరి-ఛార్మీలని ఈడీ ప్రశ్నించింది. 

లైగర్ పెట్టుబడులు విదేశీ బ్యాంకు ల నుండి పూరి, ఛార్మి ల ఖాతాలలోకి జమైనట్టుగా గుర్తించిన ఈడీ, వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. అయితే ఇప్పుడు లైగర్ హీరో పై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. నేడు విజయ్ దేవరకొండ ని ఈడీ ఆఫీస్ కి పిలిచారు అధికారులు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ని ఈడీ అధికారులు లైగర్ పెట్టుబడి లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. లైగర్ సినిమా నిర్మాణానికి పలు సంస్థల నుంచి డబ్బులు వచ్చినట్లు, విదేశీ పెట్టుబడుల విషయంలో ఈడీ అధికారులు ఆరాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే నేడు ఈడీ విచారణకు విజయ్ హాజరైనట్టుగా తెలుస్తుంది.

అయితే పూరి-ఛార్మి లని ఈడీ అధికారులు దాదాపుగా 13 గంటల పాటు ప్రశ్నించగా వారు.. లైగర్ పెట్టుబడుల విషయంలో ఇచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని, హీరో విజయ్‌ను ఈడీ ఆఫీస్ కి పిలిపించి విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

Vijay Deverakonda to face ED questioning:

Vijay Deverakonda appeared before ED office in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ