రజినీకాంత్ హీరోగా ప్రభు కీలక పాత్రలో, జ్యోతిక చంద్రముఖిగా, నయనతార హీరోయిన్ గా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాని తెలుగు, తమిళం రెండు భాషల్లో ఆడియన్స్ విపరీతంగా ఆదరించడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడలో ఈ మూవీని రీమేక్ కూడా చేసారు. ఆ చిత్రంలో అమాయకమైన గంగగా, చంద్రముఖి పాత్రలో జ్యోతిక డ్యూయెల్ షేడ్స్ లో ఇరగదీసింది. నత్తి నత్తిగా నయనతార ఆకట్టుకుంది. చంద్రముఖిగా జ్యోతిక అందరిని భయపెట్టేసింది. జ్యోతిక పెరఫార్మెన్స్ కి విమర్శకులు సైతం ప్రశంశలు కురిపించారు,.
ఇప్పుడు చంద్రముఖికి సీక్వెల్ గా చంద్రముఖి 2 ని పి వాసు దర్శకత్వంలో చేస్తున్నాడు హీరో రాఘవ లారెన్స్, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించబోతున్నట్లుగా ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా కంగనా ఆ వార్తలని నిజం చేస్తూ తాను తమిళ డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో నటించబోతున్నట్టుగా ఇన్స్టా లో పోస్ట్ చేసింది. డైరెక్టర్ వాసు దర్శకత్వంలో నటించడంపై కంగనా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.
జ్యోతిక చంద్రముఖిగా థియేటర్స్ లో అందరిని భయపెట్టి అద్భుతమైన నటనతో అబ్బురపరిచింది. మరి కంగనా ఏమేరకు చంద్రముఖిగా ఆకట్టుకుంటుందో చూడాలి. కంగనా ఈ చిత్రంలో నటిస్తే ఆమెకి ఇది రెండో తమిళ సినిమా అవుతుంది. గతంలో ఆమె అమ్మ జయలలిత బయోపిక్ లో నటించింది.