Advertisementt

శృతి హాసన్ నీ గట్స్ కి హ్యాట్సాఫ్

Wed 30th Nov 2022 10:11 AM
shruti haasan,heroines  శృతి హాసన్ నీ గట్స్ కి హ్యాట్సాఫ్
Hats off to your guts Shruti Haasan శృతి హాసన్ నీ గట్స్ కి హ్యాట్సాఫ్
Advertisement
Ads by CJ

అందాల తార శృతి హాసన్ ప్రస్తుతం సీనియర్ హీరోలైన చిరంజీవి-బాలకృష్ణ సినిమాల్లో నటించడమే కాదు, ఈ సంక్రాంతికి ఏ హీరోయిన్ కి చెయ్యలేని రేర్ ఫీట్ ని శృతి హాసన్ సాధించబోతుంది. అది ఆమె నటిస్తున్న వీర సింహ రెడ్డి-వాల్తేర్ వీరయ్య సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఆ రెండిటిలో శృతి నే హీరోయిన్. రెండూ హిట్స్ అయినా సంతోషమే. ఒక్కటి హిట్ అయినా ఆనందమే అన్నట్టుగా ఉంది శృతి హాసన్ పని. ఇంకా శృతి హాసన్ ప్రభాస్ తో సలార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తుంది. అయితే శృతి హాసన్ క్రేజీగా సినిమా ఆఫర్స్ తో కళకళాడుతున్న సమయంలో ఆమె అందవికారమైన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

హీరోయిన్స్ ని అందంగా ఊహించుకునే అభిమానులు శృతి హాసన్ ఫోటోలు చూసి భయపడేలా చేసింది. ఆమెకి ఫీవర్, అలాగే సైనస్, ఇంకా పీరియడ్స్ ప్రోబ్లెంస్ తో మొహం అంతా ఉబ్బిపోయి ఉంది. అలాంటి ఫొటోస్ షేర్ చేస్తూ ఆమె తన ప్రోబ్లెంస్ ని అందరితో షేర్ చేసుకుంది. కానీ కొంతమంది హీరోయిన్స్ తమకి ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు కనీసం బయటికి చెప్పడానికి కూడా భయపడిపోతారు. అలాంటి వారు తమ ఫొటోస్ ని షేర్ చేస్తే అభిమానులకి నచ్చవేమో అనుకుంటారు. రీసెంట్ గా సమంత తన వ్యాధిని బయటపెట్టింది. కానీ ఫేస్ రివీల్ చెయ్యలేదు. గతంలో నయనతార స్కిన్ ప్రోబ్లెంస్ ని ఫేస్ చేసింది. కానీ ఎవరితో పంచుకోలేదు. ఇంకా చాలామంది హీరోయిన్స్ పర్సనల్ ప్రోబ్లెంస్ బయటికి చెప్పడానికి భయపడతారు. 

శృతి హాసన్ డేరింగ్ తో తాను ఏ విషయంతో సఫర్ అవుతున్నానో చెప్పడమే కాదు.. తన ప్రోబ్లెంస్ వలన తాను ఎలా తయారయ్యానో అనేది ఆ ఫొటోస్ రూపంలో తెలియజేసింది. అభిమానులు అస్సహ్యించుకున్నా సరే.. తాను ఇలాంటి విషయాలు బయటపెడతా అంటుంది. ఏది ఏమైనా ఇతర హీరోయిన్స్ కన్నా శృతి హాసన్ ఇలా ఓపెన్ అయ్యింది. ఆమె గట్స్ కి మెచ్చుకోవలసిందే అంటున్నారు నెటిజెన్స్.

Hats off to your guts Shruti Haasan:

Shruti Haasan puts speculation to rest

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ