Advertisementt

ప్రభాస్ తో డేటింగ్ పై గుట్టు విప్పిన కృతి

Wed 30th Nov 2022 09:46 AM
kriti sanon,prabhas  ప్రభాస్ తో డేటింగ్ పై గుట్టు విప్పిన కృతి
Kriti Sanon reacts to reports of her dating Prabha ప్రభాస్ తో డేటింగ్ పై గుట్టు విప్పిన కృతి
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా ప్రభాస్-కృతి సనన్ ల డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉన్నాయి. తుప్పాసి రివ్యూస్ ఇస్తూ అందరి చేతిలో తిట్లు తినే ఉమైర్ సందు అయితే ఏకంగా ప్రభాస్-కృతి సనన్ డేటింగ్ లో ఉండడం ఏమిటి.. వారికి నిశ్చితార్ధం కూడా జరగబోతుంది అంటూ ఓ ట్వీట్ చేసాడు. మరి ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫాన్స్ కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ గాసిప్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ లాంచ్ టైం లో ప్రభాస్ నీ సర్జరీ కారణంగా నడవలేకపోతుంటే.. కృతి సనన్ సపోర్ట్ తీసుకున్నారు. దానితో వారి మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యి.. అవి నిశ్చితార్ధం వరకు వెళ్లాయి.

మరి ఈ రూమర్స్ కి మరింత కలరింగ్ ఇస్తూ తోడేలు నటుడు వరుణ్ ధావన్ ప్రభాస్ మదిలో ఓ యువరాణి ఉంది, కృతి సనన్ బాలీవుడ్ హీరోని కాదు, ముంబై వచ్చిపోయే హీరోని ప్రేమించింది అంటూ మరింతగా రెచ్చగొట్టేసరికి అందరూ ప్రభాస్-కృతి సనన్ విషయంలో వచ్చేవి రూమర్స్ కాదు నిజమని నమ్మే పరిస్థితికి వచ్చారు. ఈ రూమర్స్ పై కృతి సనన్ కానీ, ప్రభాస్ నుండి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. అందరూ ఈ రూమర్స్ నిజమే అనుకుంటున్నారు. 

అయితే తాజాగా కృతి సనన్ ప్రభాస్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసేలా ప్రభాస్ తో డేటింగ్ మేటర్ పై స్పందించింది. ఇది ప్రేమ కాదు, పబ్లిసిటీ స్టంట్ అంత కంటే కాదు. ఆమె వరుణ్ ధావన్ పేరు చెప్పకుండా మా తోడేలు రియాలిటీ షోలో కొంచెం హద్దులు దాటింది. ఏదో సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇలాంటి పుకార్లకు కారణం అయ్యాయి. ఎవరో ఒకరు నా పెళ్లి తేదీ గురించి ప్రకటించే ముందు.. నన్ను అసలు విషయం చెప్పనివ్వండి. ప్రభాస్ తో నేను డేటింగ్ చేస్తున్నా అనే ఈ రూమర్స్ అన్నీ నిరాధారమైనవి. ఇవన్ని పుకార్లు..వీటిని నమ్మకండి అంటూ కృతి సనన్ సోషల్ మీడియా ద్వారా అసలు విషయం బయటపెట్టింది.

Kriti Sanon reacts to reports of her dating Prabha:

Kriti Sanon Breaks Silence On Prabhas Dating Rumours

Tags:   KRITI SANON, PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ