Advertisementt

బాలయ్యతో అంటే ఆ భయం ఉండాల్సిందే

Tue 29th Nov 2022 10:14 PM
anil ravipudi,balayya fans  బాలయ్యతో అంటే ఆ భయం ఉండాల్సిందే
Anil Ravipudi about Balakrishna బాలయ్యతో అంటే ఆ భయం ఉండాల్సిందే
Advertisement
Ads by CJ

బాలకృష్ణ దగ్గరగా నడవాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా, అంతెందుకు ఆయనతో సినిమా చెయ్యాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఆ సత్యాన్ని అనిల్ రావిపూడి ఇంకా బాలయ్య తో సినిమా మొదలు పెట్టకముందే గ్రహించేసాడు. బాలయ్య తో సినిమా అంటే ఆయన అభిమానుల అంచనాలకు రీచ్ అయ్యేలా నెక్స్ట్ లెవల్ అనిపించేలా ఉండాలి. బాలయ్య లాంటి సూపర్ పవర్‌తో ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజం. సినిమా కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. బాలయ్య తో పని చెయ్యడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నా కానీ, ఒత్తిడి మాత్రం తీసుకోవడం లేదు అంటూ అనిల్ రావిపూడి బాలయ్య ప్రాజెక్ట్ పై కొన్ని విషయాలు రివీల్ చేసాడు.

ఎప్పటినుండో బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగినవాడిని, బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి ఏది సూట్ అవుతుంది, ఎలాంటి కథ సెట్ అవుతుంది. ఏది సెట్ కాదో పర్ఫెక్ట్ గా చెప్పగలను, కథలో ట్విస్ట్ లు, బీట్స్ బావుంటేనే బాలయ్య ఓకె చేస్తారు. బాలయ్యని మెప్పించాలంటే కథను జాగ్రత్తగా తయారు చేయాల్సి ఉంటుంది అని అనిల్ రావిపూడి చెప్పడం చూస్తే బాలయ్య తో సినిమా చెయ్యాలంటే ఆ మాత్రం భయం మెయింటింగ్ చెయ్యాల్సిందే అనే కామెంట్స్ నెటిజెన్స్ నుండి ఎదురవుతున్నాయి.

ఇంకా అనిల్ రావిపూడి మాట్లాడుతూ కథకు బాలకృష్ణ గారు ఆమోదం తెలిపితే ఇక సగం సినిమా పూర్తయినట్లే అని, బాలయ్య తో ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళదామా అని ఎదురు చూస్తున్నట్టుగా అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. 

Anil Ravipudi about Balakrishna:

Anil Ravipudi: Will live up to the expectations of Balayya fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ