Advertisementt

రష్మిక ఒప్పుకుంటుందా?

Tue 29th Nov 2022 08:55 PM
rashmika,ssmb28  రష్మిక ఒప్పుకుంటుందా?
Will Rashmika agree? రష్మిక ఒప్పుకుంటుందా?
Advertisement
Ads by CJ

గతంలో ఓసారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ లో కామెడీ కేరెక్టర్ లో కాస్త అతి చేసే పాత్రలో రెచ్చిపోయిన రష్మిక.. తర్వాత ఇంకోసారి అలాంటి కేరెక్టర్స్ ఒప్పుకోనని మొహం మీదే చెప్పింది. మహేష్ బాబు మూవీ కదా తనకి క్రేజ్ పెరుగుతుంది అనుకుంటే.. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక పాత్ర పై విపరీతమైన ట్రోలింగ్, నెగిటివిటి వచ్చింది. దానితో రష్మిక రియలైజ్ అయ్యింది. మళ్లీ అలాంటి పాత్ర చెయ్యనని తెగేసి చెప్పింది. అలాంటి రష్మిక ఇప్పుడు ఐటెం సాంగ్ కి ఓకె అంటుందా.. మహేష్ మూవీ కదా అని చేస్తుందా.. అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం.

ఎందుకంటే మహేష్-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న SSMB 28 లో త్రివిక్రమ్ ఈసారి ఐటెం సాంగ్ ప్లాన్ చేసిట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ సాంగ్ లో మహేష్ తో పాటుగా టాప్ హీరోయిన్ రష్మిక తో స్టెప్స్ వేయించేందుకు త్రివిక్రమ్ చూస్తున్నాడని ఆ వార్తల సారాంశం. గతంలో కాజల్, తమన్నా, సమంత కూడా ఐటమ్స్ చేసి అదరగొట్టిన వారే. క్రేజీ హీరోయిన్స్ గా కొనసాగుతున్న టైమ్ లోనే ఈ తారలు ఐటెం సాంగ్స్ లో నర్తించారు. 

అందుకే రష్మిక కూడా ఇప్పుడు మహేష్ SSMB28 లో చేసేందుకు మొగ్గు చూపిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. చూద్దాం.. రష్మిక-మహేష్ స్పెషల్ సాంగ్ తో ఫాన్స్ కి ట్రీట్ ఇస్తారేమో అనేది.

Will Rashmika agree?:

Rashmika item song in SSMB28

Tags:   RASHMIKA, SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ