Advertisementt

బిగ్ బాస్ 6: ఎనిమీస్ మధ్య రొమాన్స్

Tue 29th Nov 2022 07:25 PM
bigg boss 6,srihan,inaya  బిగ్ బాస్ 6: ఎనిమీస్ మధ్య రొమాన్స్
Bigg Boss 6: Romance Between Enemies బిగ్ బాస్ 6: ఎనిమీస్ మధ్య రొమాన్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టాస్క్ ల్లో పడి గేమ్ మొదలు పెట్టిన తర్వాత ఇనాయ అందరి మీదా మాటల తూటాలు పేల్చడం స్టార్ట్ చేసింది. ఆ ప్రొసెస్ లో ఆమె ఎక్కువగా శ్రీహన్ ని టార్గెట్ చేసింది. అలానే ఆమె హౌస్ లో బాగా హైలెట్ అయ్యింది. ఇనాయ శ్రీహన్ తో క్లోజ్ గా ఉందామనుకుంటే నాకు బయట సిరి ఉంది.. అంటూ బిల్డప్ ఇవ్వడంతో ఇనాయ పర్సనల్ గా శ్రీహన్ మీద పెట్టుకుంది. ఎప్పుడు దొరుకుతాడా టార్గెట్ చేద్దామని కాచుకుని కూర్చున్న ప్రతిసారి శ్రీహన్ దొరకడం ఇనాయ గొడవ పెట్టుకోవడం, వారి మధ్యన ఫైట్ జరగడం అటు హౌస్ మేట్స్ కే కాదు, ఇటు బుల్లితెర ప్రేక్షకులు ఎంజాయ్ చేసారు.

ఒకసారి రేవంత్ సంచాలక్ గా ఇచ్చిన డెసిషన్ పై ఇనాయ ఏదో మాట్లాడుతుండగా శ్రీహన్ ఏ పిట్ట కూసినా పట్టించుకోవద్దు అంటూ ఇనాయని ఉద్దేశించి అనేసరికి దానికి ఇనాయ రెచ్చిపోయి శ్రీహన్ వెంటపడి వేధించింది. తర్వాత నామినేషన్స్ విషయంలోనూ ఇద్దరికీ గొడవ జరిగేది. మధ్యలో ఓ టాస్క్ విషయంలో ఇనాయ శ్రీహన్ ని పొగడడం శ్రీహన్ కే షాకిచ్చింది. తర్వాత ఇద్దరూ గొడవ పడడం మానెయ్యడంతో స్టేజ్ పై హైపర్ ఆది కూడా మీరు గొడవ పడితే బావుంది అని చెప్పాడు. గీతూ కూడా ఇనాయతో నీ ఫైట్ బావుంటుంది అంటూ శ్రీహన్ తో చెప్పింది.

అంత ఎనిమీస్ గా ఉన్న ఇద్దరూ లాస్ట్ వీక్స్ లో ఫ్రెండ్స్ గా మారిపోవడం కాదు, ఇద్దరూ ఈ రోజు టికెట్ టు ఫినాలే టాస్క్ లో రొమాంటిక్ గా రెచ్చిపోయి డాన్స్ చేసారు. అంతేకాదు టాస్క్ ల్లోనూ కొట్టుకునే విషయంలో వారి మధ్యన శత్రుత్వం కాదు ఇప్పుడు రొమాన్స్ కనిపించింది. సత్య, రేవంత్ ఇద్దరూ శ్రీహన్ ని ఏడిపించారు కూడా. నెటిజెన్స్ కూడా ఎనిమీస్ ఇద్దరూ రొమాంటిక్ గా రెచ్చిపోతున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Bigg Boss 6: Romance Between Enemies:

Bigg Boss 6: Srihan romance with Inaya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ