NBK అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దానితో ఆహా వారు సీజన్ 2 ని ఊరించి ఊరించి గ్రాండ్ గా మొదలు పెట్టారు. అన్ స్టాపబుల్ కి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ప్రోమోస్ తో ఆహా ఓహో అనిపించిన ఆహా వారు ఎపిసోడ్స్ విషయంలో ఆసక్తిని క్రియేట్ చేయలేకపోతున్నారు. తాజాగా అన్ స్టాపబుల్ 5 వ ఎపిసోడ్ లో నలుగురు లెజెండ్స్ ని స్టేజ్ పైకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదటిసారి ఓ టాక్ షో స్టేజ్ పై లెజెండరీ డైరెక్టర్ ని చూస్తామంటూ క్యూరియాసిటీ పెంచుతున్నారు.
ఆయనే కె విశ్వనాథ్.. కె విశ్వనాథ్ ని అల్లు అరవింద్ గారు ప్రత్యేకంగా అన్ స్టాపబుల్ టాక్ షోకి ఆహ్వానించబోతున్నారట. అంతేకాకుండా అల్లు అరవింద్ కూడా ఆహా టాక్ షోకి రాబోతున్నారు. గతంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ లో అరవింద్ వచ్చారు. ఇప్పుడు మరోసారి. మరో ఇద్దరు లెజెండ్స్ కూడా అదే ఎపిసోడ్ కి రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వారే సురేష్ బాబు, కె రాఘవేంద్రరావు కూడా రాబోతున్నారని.. ఈసారి ఎపిసోడ్ లో నలుగురు మహా మహులు సందడి చేయబోతున్నారని తెలుస్తుంది.
సో ఆహా అన్ స్టాపబుల్ ని క్రేజీగా మార్చాలని మేకర్స్ ఇలా ఒకేసారి నలుగురిని స్టేజ్ పై కూర్చోబెడుతున్నారన్నమాట. ఆహా అనిపించేలా ఈ ఎపిసోడ్ ని ఎలా డిజైన్ చేస్తారో చూడాలి.