టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న వారసుడు సినిమాతో వివాదం కొని తెచ్చుకున్నారు. డబ్బింగ్ సినిమాలు పండగల టైమ్ లో విడుదల చెయ్యకూడదు అన్న దిల్ రాజే.. ఇప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాని తెలుగు సినిమాలపై అందులోను పండగకి రిలీజ్ చేయడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినిమా మొదలు పెట్టినప్పుడే సంక్రాంతికి రిలీజ్ అని చెప్పాము, తర్వాత ఎవరి ఇష్టం వారిది, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని స్పష్టం చేసాడు. అదే ఇంటర్వ్యూలో ఆయన రీసెంట్ గా చేసుకున్న రెండో పెళ్లి పై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో అకాలమరణం చెందగా.. నాలుగేళ్ళ తర్వాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నాడు. అయితే తాను ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాడు. తన భార్య అనిత మరణం తర్వాత రెండేళ్లు మెంటల్ గా డిస్టర్బ్ అవడంతో తన పేరెంట్స్ కుంగిపోయారని, ఆ సమయంలో నాకూతురు హర్షితా, అల్లుడు నా దగ్గరే ఉన్నారు. నేను చాలా కుంగిపోయాను, నాకున్న వ్యాపకం గ్యాంబ్లింగ్ చెయ్యడమే. అలా నన్ను చూసి మా పేరెంట్స్, నాకూతురు చాలా డిస్టర్బ్ అయ్యారు.
మా పేరెంట్స్ నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసారు. మా అమ్మాయి కూడా నాకు సపోర్ట్ చేసింది. నా కుటుంబం సఫర్ కావొద్దనే ఉద్దేశ్యంతో నేను రెండో పెళ్ళికి సిద్దమయ్యాను. 2020 లో తేజస్వినితో నా వివాహం జరిగింది అంటూ దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి విషయాలను బయటపెట్టాడు. ప్రస్తుతం దిల్ రాజు-తేజస్వినిలకి ఓ బాబు పుట్టాడు. దిల్ రాజు వారసుడు పేరు అన్వయ్ రెడ్డి.